Begin typing your search above and press return to search.
వెబ్ సిరీస్ రివ్యూ : ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’
By: Tupaki Desk | 19 Jun 2021 8:49 AM GMT‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’ వెబ్ సిరీస్ రివ్యూ
నటీనటులు: ప్రియదర్శి-నందిని రాయ్-పోసాని కృష్ణమురళి-వికాస్-చంద్రకాంత్ దత్తా
సంగీతం: దీపక్ అలెగ్జాండర్
ఛాయాగ్రహణం: వరుణ్ డీకే
మాటలు: ప్రదీప్ ఆచార్య
నిర్మాత: సురేష్ కృష్ణ
రచన-దర్శకత్వం: విద్యాసాగర్ ముత్తుకుమార్
హిందీతో పోలిస్తే తెలుగులో పేరున్న ఆర్టిస్టులతో చేసిన పెద్ద స్థాయి వెబ్ సిరీసులు తక్కువే. ఈ మధ్యే మన భాషలో ‘ఒరిజినల్స్’ స్థాయి పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన కొత్త సిరీస్.. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. ‘బాషా’ దర్శకుడు సురేష్ కృష్ణ.. ‘ఆహా’ కోసం నిర్మించిన సిరీస్ ఇది. ప్రియదర్శి.. నందిని రాయ్ ప్రధాన పాత్రల్లో విద్యాసాగర్ ముత్తుకుమార్ ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’ను రూపొందించాడు. దీని ట్రైలర్ చూస్తే.. తెలుగులో ఇప్పటిదాకా వచ్చిన వెబ్ సిరీసులన్నింటితో పోలిస్తే చాలా బోల్డ్ గా.. వయొలెంట్ గా ఉండేట్లే కనిపించింది. మరి ఈ సిరీస్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిచ్చిందో చూద్దాం.
ఆది (ప్రియదర్శి) రాజమండ్రిలో కారు డ్రైవర్ గా పని చేస్తున్న ఒక మామూలు కుర్రాడు. తండ్రి చిన్నపుడే తల్లిని తనను వదిలేసి వెళ్లిపోతే.. ఆ తర్వాత తల్లి కూడా చనిపోతే ఒంటరిగా కష్టపడి జీవనం సాగిస్తుంటాడు. బాగా డబ్బు సంపాదించి మంచి స్థాయికి చేరుకోవాలన్నది అతడి కల. ఆదికి తన ఊర్లోనే ఉండే మధ్యవయస్కుడైన అయ్యప్ప (పోసాని కృష్ణమురళి) పడుచు భార్య మీనా (నందిని రాయ్) మీద కన్నుంటుంది. ఆమె కూడా ఆది పట్ల కొంత ఆసక్తితోనే ఉంటుంది. ఐతే మీనా మీద మోజుతోనే ఆమె చెప్పిన ఓ పని చేయబోయే పెద్ద సమస్యలో చిక్కుకుంటాడు. దీంతో అతడి జీవితం అతలాకుతలం అయిపోతుంది. ఆ సమస్య ఏంటి.. దాని వల్ల ఎవరి జీవితాలు ఎలా ప్రభావితం అయ్యాయన్నది ఈ కథ.
ఒక పెద్ద ఇల్లు.. అందులో ఓ అందమైన అమ్మాయి చేతులకు బేడీలు వేసుకుని బెడ్ రూంలోకి వెళ్తుంది. అక్కడో అబ్బాయి చైన్లతో మంచానికి కట్టి పడేయబడి ఉంటాడు. ఇద్దరి మధ్య రాసలీల మొదలవుతుంది. ఇంతలో ఆ అమ్మాయి భర్త ఇంటి కాంపౌండ్లోకి అడుగు పెట్టి భార్యను కేక వేస్తాడు. బెడ్ మీద ఉన్న ఆ ఇద్దరూ షేకైపోతారు. ఆ అబ్బాయి చైన్ విడిపిద్దామని చూస్తే దాని తాళం చెవి కనిపించదు. ఓ పక్క భర్త అరుస్తుంటాడు. ఇంకోవైపు ఎంత వెదికినా తాళం చెవి కనిపించదు. ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’ ఆరంభ సన్నివేశం ఇది. కథలో కీలక మలుపుకు కారణమయ్యే ఈ సన్నివేశాన్ని బట్టే ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’ ఎంత బోల్డ్ గా ఉండబోతోందో అర్థమవుతుంది. ఈ సిరీస్ మీద అమితాసక్తిని రేకెత్తించే సన్నివేశమిది. ఐదు ఎపిసోడ్లలో ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’ తొలి సీజన్ కు హైలైట్ కూడా ఈ సీన్.. దాని చుట్టూ తిరిగే ఎపిసోడే. అందులో వచ్చే స్టన్నింగ్ ట్విస్టు ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి చూసేలా చేస్తుంది. ఈ సిరీస్ మీద ఆసక్తిని పెంచుతుంది.
ఇది కచ్చితంగా చూసి చూడాల్సిన సిరీస్ అన్న భావన కలిగించే ఎపిసోడ్ ఇది. కానీ ముందుకు సాగుతున్న కొద్దీ మాత్రం ‘ఎందుకు చూస్తున్నాం?’ అనే ప్రశ్నలు కూడా రేకెత్తిస్తుంది ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’. ఒక దశ వరకు బాగానే నడిచినా.. తర్వాత క్రమ క్రమంగా గాడి తప్పి.. ప్రేక్షకులను అయోమయంలోకి నెట్టి అర్ధంతరంగా ముగుస్తుంది ఈ సిరీస్. పైన చెప్పుకున్న సీనే కాదు.. ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసే మరి కొన్ని సన్నివేశాలు కూడా ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’లో మరికొన్ని ఉన్నాయి. కథ ఆరంభంలో కొంచెం నెమ్మదిగా అనిపించినా.. తొలి ఎపిసోడ్ చివర్లో వచ్చే ట్విస్టుతో ఊపందుకున్నట్లే కనిపిస్తుంది. ఇక్కడి నుంచి తర్వాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠను కాసేపు బాగానే మెయింటైన్ చేశాడు దర్శకుడు విద్యాసాగర్ ముత్తుకుమార్. ముందు భయస్థుడిగా చూపించి.. ఆ తర్వాత ప్రియదర్శి పాత్రను మలుపు తిప్పిన తీరు ఆకట్టుకుంటుంది. ఆ పాత్రతో ముడిపడ్డ సన్నివేశాలన్నీ బాగానే కనిపిస్తాయి. అలాగే నందిని రాయ్ పాత్ర కూడా కూడా బోల్డ్ గా.. కొంచెం స్టన్నింగ్ గా ఉండి ఆసక్తి రేకెత్తించేదే.
ఐతే తొలి ఎపిసోడ్లో ట్విస్టు.. ఆ తర్వాతి రెండు ఎపిసోడ్లలో ఆ ట్విస్టు చుట్టూ అల్లిన కథనం బాగానే నడిచే ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’ ఆ తర్వాత మాత్రం నిరాశకు గురి చేస్తుంది. రాజమండ్రిలో ఐదు కోట్ల హవాలా డబ్బును అందుకున్న వ్యక్తి.. ఆ డబ్బుతో సంబంధం లేకుండా అనూహ్యంగా హత్యకు గురి కావడం.. ఆ డబ్బు కోసం హైదరాబాద్ నుంచి గ్యాంగ్ రావడం.. వాళ్లు ఇక్కడొచ్చి డబ్బు కోసం అందరినీ వెంటాడడం.. ఈ క్రమంలో కథ కొంత వరకు ఉత్కంఠభరితంగానే సాగినా.. తర్వాత ఉన్నట్లుండి ఈ వ్యవహారం పక్కకు వెళ్లిపోతుంది. మూడు ఎపిసోడ్ల వరకు ‘ఓకే’ అనిపించే ‘ఇన్ ద నేమ్ ఆఫ్ ద గాడ్’ తర్వాతి ఎపిసోడ్లలో మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ప్రియదర్శి పాత్ర తాలూకు పరిణామ క్రమాన్ని బాగా చూపించిన దర్శకుడు.. ఆ తర్వాత కథలో కానీ.. పాత్రల్లో కానీ ఆసక్తిని సస్టైన్ చేయలేకపోయాడు. అసలు హవాలా డబ్బు గురించి తెలిసి కూడా దాన్ని వెతికే ప్రయత్నం చేయకుండా గంజాయి వ్యాపారం చేయడం.. ఉన్నట్లుండి పెళ్లి చేసుకోవడం లాంటి వ్యవహారాలు అంతగా ఆసక్తి రేకెత్తించవు.
రాను రాను ప్రియదర్శి పాత్రతో ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్ట్ తెగిపోతుంది. ప్రధాన పాత్ర పట్ల ప్రేక్షకుల్లో ఒక ఆపేక్ష కలగకపోవడం ఈ సిరీస్ కు మైనస్సే. మొదట్లో ఎగ్జైటింగ్ గా అనిపించే నందిని రాయ్ క్యారెక్టర్ సైతం తర్వాత ప్రాధాన్యం కోల్పోతుంది. మిగతా క్యారెక్టర్లు సంగతి సరేసరి. ఒక దశ దాటాక సన్నివేశాలు ఒకదాంతో ఒకటి సంబంధం లేనట్లుగా నడుస్తాయి. ఒక వెబ్ సిరీస్ ను తొలి సీజన్ తర్వాత కూడా కొనసాగించాలని అనుకున్నపుడు చివరికి వచ్చేసరికి ఉత్కంఠ పెంచుతారు. కథను అనూహ్య మలుపు తిప్పి రెండో సీజన్ మీద ఆసక్తి రేకెత్తించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా థ్రిల్లర్ సిరీస్ లకు కచ్చితంగా ఉండాల్సిన లక్షణాలివి. కానీ ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’ మాత్రం ఇందుకు భిన్నం. చాలా ఎగ్జైటింగ్ గా మొదలై.. సగం వరకు ఉత్కంఠ రేకెత్తించాక.. ఆ తర్వాత ఉత్కంఠను పెంచాల్సింది పోయి.. ఇంటెన్సిటీ తగ్గించేశారు. ఇదొక థ్రిల్లర్ సిరీస్ అన్న సంగతే మరిచిపోయేలాగా చివరి రెండు మూడు ఎపిసోడ్లలో పూర్తిగా వేగం తగ్గిపోయి ఇదెప్పుడు ముగుస్తుందా అన్న భావన కలిగిస్తుంది. రెండో సీజన్ దిశగా హింట్ ఇచ్చే చివరి సన్నివేశం కూడా ఏమంత ఎగ్జైటింగ్ గా అనిపించదు.
‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’లో బోల్డ్ సీన్లు యువతను బాగానే అలరించవచ్చు. కానీ ఇందులో అవసరానికి మించి వాడిన బూతు పదాలు మాత్రం ఎవరికీ అంతగా రుచించకపోవచ్చు. ఓటీటీలో రిలీజైన వెబ్ సిరీస్ కాబట్టి అవసరాన్ని బట్టి పాత్రలతో బూతులు మాట్లాడిస్తే ఓకే అనుకోవచ్చు. కానీ అవసరం లేకున్నా.. అదే పనిగా పచ్చి బూతులు మాట్లాడించడం దక్కే ప్రయోజనమేంటో మేకర్స్ కే తెలియాలి. ఇక కథాకథనాల సంగతి పక్కన పెడితే.. ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’కు మంచి ఆర్టిస్టులు దొరికారు. టెక్నికల్ సపోెర్ట్ కూడా బాగానే కుదిరింది. ప్రియదర్శి.. నందిని రాయ్.. పోసానిల పెర్ఫామెన్స్ ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం.. కెమెరా పనితనం.. ఇతర సాంకేతిక హంగులూ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఓకే. ఇప్పటిదాకా తెలుగులో వచ్చిన వెబ్ సిరీస్ లు అన్నింటితో పోలిస్తే స్థాయి పరంగా ఇది మెరుగే. కానీ మంచి విషయం ఉన్నట్లే కనిపించి.. మధ్యలో గాడి తప్పిన ఈ సిరీస్ ట్రైలర్లో రేపిన అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. తెలుగులో ఒక స్పెషల్ సిరీస్ గా నిలిచేలా అంచనాలు రేకెత్తించి.. చివరికి మామూలుగా ముగుస్తుంది ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’.
చివరగా: ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్.. కొన్ని మెరుపులు కొన్ని మరకలు
రేటింగ్-2.5/5