Begin typing your search above and press return to search.
నామినేషన్స్ లో రచ్చ.. ఈసారి ఏకంగా పది మంది
By: Tupaki Desk | 20 Sep 2022 5:22 AM GMTబిగ్ బాస్ మూడవ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ ఎప్పటిలాగే రసవత్తరంగా సాగింది. ఆదివారం ఎపిసోడ్ కు సంబంధించిన కొన్ని విషయాలను కంటిన్యూ చేస్తూ సోమవారం ఎపిసోడ్ టెలికాస్ట్ జరిగింది. సోమవారం ఎపిసోడ్ అంటే ప్రేక్షకులకు కచ్చితంగా చాలా ఆసక్తి ఉంటుంది. నామినేషన్ ప్రక్రియ రచ్చ రచ్చ అవుతూనే ఉంది. ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా కొట్టుకోవడమే తక్కువ అన్నట్లుగా కంటెస్టెంట్స్ గొడవ పడ్డారు.
కంటెస్టెంట్స్ ఒకొక్కరు ఇద్దరు చొప్పున రంగు పూసి మరీ నామినేట్ చేయాలంటూ బిగ్ బాస్ సూచించాడు. రెడ్ కలర్ ని మొహానికి పూస్తూ కంటెస్టెంట్స్ నామినేషన్ చేసే పక్రియ హాట్ హాట్ గానే సాగింది. శ్రీ సత్యతో నామినేషన్ పక్రియ ను బిగ్ బాస్ ప్రారంభించాల్సిందిగా పేర్కొన్నారు. ఆమె ఆరోహిని మరియు ఇనయా సుల్తానాని నామినేట్ చేసింది. ఈ ఇద్దరు కూడా తన యొక్క ఆటను చూడకుండా గత వారం వరస్ట్ ఇవ్వడం వల్లే తాను నామినేట్ చేసినట్లుగా మొదలు పెట్టింది.
ఆమెతో మొదలైన ప్రక్రియ రచ్చ రచ్చ అన్నట్లుగా దాదాపుగా గంట సాగింది. గీత మొదటగా సుదీప ని ఆ తర్వాత చంటీ ని నామినేట్ చేసింది. సుదీప ను నామినేట్ చేసిన సమయంలో టిష్యూ పేపర్స్ తీయలేదని.. క్లీనింగ్ కారణం చూపించి నామినేట్ చేసింది. దాంతో సిల్లీ రీజన్ అంటూ సుదీప తీవ్ర ఆగ్రమం వ్యక్తం చేసింది. ఇలా ప్రతి ఒక్కరు నామినేట్ చేసిన సమయంలో చాలా హాట్ హాట్ చర్చలు జరిగాయి.
చంటి తన వంతు వచ్చిన సమయంలో గీతూ.. రేవంత్ లను నామినేట్ చేశాడు. గీత తనను నామినేట్ చేసిన వారి పట్ల కాస్త దురుసుగా ప్రవర్తించడంతో పాటు ఆమె విషయం చాలా రఫ్ గా ఉందంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో గీతూను ఎంటర్ టైనర్ గా కూడా ప్రేక్షకులు అంటున్నారు.
మొత్తానికి ఈ వారంలో బిగ్ బాస్ సీజన్ 6 నుండి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన వారు.. రేవంత్... శ్రీహాన్.. బాలాదిత్య... చంటి.. గీతూ.. నేహా.. సుదీప.. అరోహి.. ఇనయ.. వాసంతి లు ఉన్నారు. వీరిలో రేవంత్ కు గత వారం మాదిరిగానే అత్యధిక ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అతి తక్కువ ఓట్లు ఇనయ.. వాసంతి లకు వచ్చే అవకాశం ఉంది. వీరిద్దరిలో ఒకరు ఈ వారం బిగ్ బాస్ హౌస్ ని వీడే అవకాశాలు ఉన్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.