Begin typing your search above and press return to search.
ఆర్జీవితో డాన్స్ చేస్తే ఇంత గోల జరుగుతుందనుకోలేదు!
By: Tupaki Desk | 21 July 2022 5:40 AM GMTసినిమా అనేది ఒక రంగుల ప్రపంచం అనే విషయాన్ని బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే చెప్పారు. ఆ రంగుల్లో వెలిగిపోవాలని చాలామంది ఆశ పడుతుంటారు .. ఆరాటపడుతుంటారు. సినిమాల వలన పేరు - డబ్బూ రెండూ వస్తాయి. నలుగురిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అందరి చూపులను తమ వైపుకు తిప్పుకునే శక్తి సినిమా తారలకు ఉంటుంది. అందువలన సినిమాల్లోకి వెళ్లడానికి చాలామంది ఉత్సాహాన్ని చూపుతుంటారు. సినిమాల్లోకి అడుగుపెట్టాలంటే ముందుగా కావలిసింది పరిచయాలే.
అలాంటి పరిచయాల కోసమే చాలామంది పాకులాడుతూ ఉంటారు. ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ల ప్రోత్సాహం దొరికితే సినిమాల్లో తమ ఎంట్రీ ఈజీగా జరిగిపోతుందని భావిస్తారు. అలాంటివారితో కలిసి కనిపిస్తే జనం దృష్టిని ఆకర్షించవచ్చని భావిస్తుంటారు. అందుకోసం పార్టీల పేరుతో సందర్భాలు కలిసివస్తూనే ఉంటాయి. అప్పుడు అనుకున్న వారిని ఆహ్వానించడం .. వాళ్లతో కలిసి సందడి చేయడం కామన్. అలా ఆర్జీవితో తాను చేసిన డాన్స్ తనని ఫ్యామిలీ నుంచి మరింత దూరం చేసిందని తాజా ఇంటర్వ్యూలో ఇనయా సుల్తానా వాపోయింది.
ఇనయా సుల్తానా కూడా వెండితెరపై వెళ్లిపోవాలని ఆశతో ఇండస్ట్రీకి వచ్చింది. ఏవో ఒకటి .. రెండు చిన్న సినిమాలు చేస్తోంది. ఆ సినిమాల వలన తనకి మంచి గుర్తింపు రావాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తన బర్త్ డే రోజున ఆర్జీవితో కలిసి ఆమె చేసిన డాన్స్ వీడియో బాగా వైరల్ అయింది.
ఎందుకంటే ఆ డాన్సు లో వర్మ ఆమె కాళ్లపై పడిపోవడం హైలైట్. ఇనయా సుల్తానా అనే పేరు ఎక్కువమందికి తెలిసింది అప్పుడే. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. " మొదటి నుంచి కూడా నాకు ఆర్జీవి గారు అంటే చాలా ఇష్టం. మొదటిసారి ఆయనను చూసినప్పుడు నాకు మాటలు రాలేదు.
ఆ తర్వాత ఆర్జీవీ సార్ తో పరిచయం ఏర్పడింది. నా బర్త్ డేకి పిలిస్తే ఆయన వచ్చారు .. అప్పుడు చేసిన డాన్స్ బాగా వైరల్ అయింది. మా ఇంట్లో వాళ్లు జాబ్ చేయడానికి కూడా నన్ను పంపించకపోతే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను. రెండేళ్లుగా నేను ఇంటికి వెళ్లలేదు .. వెళ్లే ఆలోచన కూడా లేదు. అందువలన ఆ వీడియో తరువాత మా వాళ్లంతా నన్ను హేట్ చేయడం .. తప్పుగా చూడటం మొదలుపెట్టారు. మా డాడీ ఉండి ఉంటే ఆయన సపోర్ట్ ఉండేది .. ఆయన కోవిడ్ సమయంలో చనిపోయారు.
నేను ఇండస్ట్రీలో ఉంటాను .. స్టార్ గా ఎదగాలని అనుకుంటున్నాను .. ఆ దిశగా ముందుకు వెళతాను అనే నమ్మకం ఉంది. మా వాళ్లకి అది ఇష్టం లేదు కనుక, వాళ్ల ఇంటిపేరును చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. కాస్టింగ్ కౌచ్ ను ఫేస్ చేశాను .. కొన్ని సినిమాలను వదులుకున్నాను. ఎలాంటి కమిట్ మెంట్స్ లేకుండా చిన్న చిన్న ప్రాజెక్టులను చేసుకుంటున్నాను. ఇండస్ట్రీలో ఒక్కరు కూడా తెలియకుండా వచ్చాను .. ఇంతవరకూ వచ్చాను. ఇకముందు కూడా ఇంతే పట్టుదలతో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.