Begin typing your search above and press return to search.

తెలుగు ప్రొడ్యూసర్లపై ఐటీ కన్ను?

By:  Tupaki Desk   |   7 May 2018 2:30 PM GMT
తెలుగు ప్రొడ్యూసర్లపై ఐటీ కన్ను?
X
ఒక నిర్మాతేమో రెండు రోజుల్లో తమ సినిమా వంద కోట్ల గ్రాస్ సాధించిందని పోస్టర్ వదులుతాడు. ఇంకో నిర్మాత రెండ్రోజుల్లో 64 కోట్ల గ్రాస్ అంటాడు. ఇంకొకరు రూ.200 కోట్ల పోస్టర్ కూడా వేస్తారు. రీజనల్ స్థాయి సినిమాలకు ఈ స్థాయి వసూళ్లా అంటూ వేరే ఇండస్ట్రీల వాళ్లు ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఐతే ట్రేడ్ పండిట్లు.. కలెక్షన్ల వివరాలు ప్రకటించే వెబ్ సైట్లు ఇస్తున్న వసూళ్లు దీనికి భిన్నంగా ఉంటున్నాయి. ఆయా చిత్రాల వసూళ్లు ఆ రేంజిలో లేవని చాటి చెబుతున్నాయి. మరి నిర్మాతలు ఎందుకంత ధైర్యం చేస్తున్నారో మరి. ఇలా ఎక్కువ చేసిచూపించుకోవడం వల్ల తలెత్తే ఇబ్బందుల్ని వాళ్లు దృష్టిలో ఉంచుకుంటున్నారా అన్నది సందేహం. ఐటీ అధికారులు ఈ వసూళ్ల వివరాలపై ఓ కన్నేయకుండా ఉంటారా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

నిజానికి కొంత కాలంగా ఐటీ అధికారులు ఈ విషయాన్ని జాగ్రత్తగానే పరిశీలిస్తున్నట్లు సమాచారం. జీఎస్టీ అమల్లోకి వచ్చాక పన్నుల చెల్లింపుల్లో తేడాలు ఉంటున్నాయని.. కొందరు ప్రముఖ నిర్మాతలకు నోటీసులు కూడా వెళ్లాయని గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొన్ని సినిమాలకు సంబంధించిన వసూళ్ల గురించి గొప్పలు పోతూ నిర్మాతలు ఘనంగా పోస్టర్లు వేసుకుంటున్నారు. మరి ఆ లెక్కల ప్రకారమే వాళ్లు జీఎస్టీ కడుతున్నారా లేదా అని ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారట. ఇప్పుడు ప్రకటిస్తున్న లెక్కలకు.. వాళ్లు కట్టే పన్నుకు పొంతన ఉందా అని క్రాస్ చెక్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నారట. కేవలం నిర్మాత స్థాయి నుంచే కాక బయ్యర్లు.. ఎగ్జిబిటర్లు.. ఇలా అందరూ ఈ లెక్కలకు తగ్గ జీఎస్టీ చెల్లిస్తున్నారా అని పర్యవేక్షించబోతున్నరట. ఈ నేపథ్యంలో ఘనమైన ప్రకటనలు చేసుకున్న నిర్మాతలకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.