Begin typing your search above and press return to search.
చిక్కుల్లో అమితాబ్ బచ్చన్
By: Tupaki Desk | 14 Aug 2017 7:49 AM GMTబాలీవుడ్ ఆల్ టైం సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు పనామా పేపర్లకు సంబంధించిన కుంభకోణంలో చిక్కులు తప్పేటట్లు లేవు. ఈ కుంభకోణం విషయమై సీరియస్ గా స్పందించిన ఆదాయపన్ను శాఖ ఇప్పటికే దాదాపు 33 మందిపై చర్యలకు ఉపక్రమించగా.. ఇతరులపై కూడా దర్యాప్తును వేగవంతం చేసింది. అమితాబ్ బచ్చన్ సహా పలువురిపై ఆదాయపన్ను శాఖ దృష్టి కేంద్రీకరించింది. పనామా పేపర్లకు సంబంధించిన బయటపడ్డ సమాచారంతో అమితాబ్ వ్యాపార లావాదేవీలపై ఐటీ అధికారులు దృష్టిపెట్టనున్నారు. గ్లోబల్ టాస్క్ ఫోర్స్‌లో భాగమైన ఇండియా పనామా పేపర్లలో ఉన్న వ్యక్తుల వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు అత్యున్నత స్థాయి బృందాన్ని బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్‌కు పంపింది.
అక్కడి నుంచి వచ్చే సమాచారాన్ని విశ్లేషించి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలను అమితాబ్ ఇప్పటికే ఖండించారని.. పూర్తి సమాచారం వచ్చేంతవరకు ఆయనపై విచారణ చేపట్టలేమని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇది సుదీర్ఘమైన ప్రక్రియ అని.. పనామా పేపర్లలో పేర్లు బయటకి వచ్చిన వారిపై దర్యాప్తు ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పనామాకు చెందిన మొసాక్ ఫోన్సెకా కంపెనీ ద్వారా విదేశాల్లో బోగస్ కంపెనీలు స్థాపించిన 500 మంది భారతీయ ప్రముఖుల పేర్లతోపాటు అమితాబ్ బచ్చన్.. గత ఏడాది వార్తలొచ్చాయి. ఐతే తమపై వచ్చిన ఆరోపణల్ని అమితాబ్.. ఐశ్వర్య ఖండించారు. ఈ కుంభకోణంలో తమకు ఎలాంటి పాత్ర లేదని చెప్పారు.