Begin typing your search above and press return to search.

చిరంజీవి హీరోయిన్ పైనా ఐటి దాడులు

By:  Tupaki Desk   |   11 April 2017 10:14 AM GMT
చిరంజీవి హీరోయిన్ పైనా ఐటి దాడులు
X
దొంగమొగుడు.. యమకింకరుడు.. ఆరాధన.. న్యాయం కావాలి.. ఇలాంటి అనేక సినిమాల్లో లీడ్ పెయిర్ గా అలరించారు.. మెగాస్టార్ చిరంజీవి మరియు తమిళ హీరోయిన్ రాధిక. అయితే ఇప్పుడు రాధిక భర్త శరత్ కుమార్ పై జరుగుతున్న ఆదాయపు పన్ను శాఖ దాడులు.. ఇక రాధిక మీద కూడా పడిపోయాయ్. ఈరోజు ఉదయం చెన్నయ్ లో రాధికకు ఊహించని షాకే తగిలింది.

రాధిక చాలా సంవత్సరాల నుండి రాడాన్ మీడియా పేరుతో ఒక ఎంటర్టయిన్మంట్ కంపెనీ నడుపుతున్నారు. ఈ కంపెనీలో కోట్ల రూపాయల ఇన్వెస్టుమెంటులు కూడా వచ్చి పడ్డాయి. పిన్ని.. శివయ్య.. వంటి సీరియల్స్ నుండి ఇప్పటివరకు అనేకానేక హిట్ సీరియల్స్ తీశారు. ఈరోజు ఉదయం నుండి రాధికకు చెందిన రాడాన్ మీడియా కంపెనీ ఆఫీసుల్లో ఐటి శాఖ భారీ దాడులే చేస్తోందట. మార్నింగ్ లోపలికి వెళ్లినవారు ఎవ్వరూ ఇప్పటివరకు బయటకు రాలేదు. ఒక్క ఫోన్ కాల్ లోపలికి వెళ్లట్లేదు.. ఒక్క ఫోన్ కాల్ బయటకు రావట్లేదు. ఆల్రెడీ 10 కోట్ల వరకు అక్రమంగా కలిగియున్నారని శరత్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంటే.. ఇప్పుడు రాధిక కంపెనీలపై కూడా దాడులు జరగడం సంచలనంగా కనిపిస్తోంది.

మొన్నటివరకు ఎక్కడ మైక్ చేతికి చిక్కినా కూడా నీతి నిజాయితీ అంటూ క్లాసులు పీకేసి.. విశాల్‌ వంటి హీరోలపై భారీ స్థాయిలో నిప్పులు చెరిగిన రాధిక అండ్ శరత్ కుమార్ లు.. ఐటి దాడుల యవ్వారంలో క్లీన్ గా బయటపడతారా? లెటజ్ సీ!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/