Begin typing your search above and press return to search.
థ్రెట్ డిటెక్టెడ్ : సినిమా వాళ్లపై ఐటీ దాడులు
By: Tupaki Desk | 29 Sep 2018 4:34 PM GMT2018-19 ఎన్నికల వేళ టాలీవుడ్ - కోలీవుడ్ సెలబ్రిటీ ఇళ్లకు ఐటీ ఝలక్ తగలనుందా? అంటే అవుననే తాజాగా సమాచారం లీకైంది. ఎన్నికల వేళ ఏ స్టార్ ఏఏ రాజకీయపార్టీల క్యాంపెయినింగ్ లో పాల్గొంటున్నారో - ఏ పార్టీల్లో చేరబోతున్నారో పక్కాగా జాబితా తెప్పించుకున్న నరేంద్ర మోదీ & టీమ్ ఐటీ ఎటాక్స్ రూపంలో గురి పెట్టనుందని తెలిసింది. ఆ మేరకు సినిమా వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది.
తాజాగా తమిళ కథానాయకుడు విజయ్ సేతుపతి నివాసంపై ఐటీ దాడులు జరగడం ఆసక్తికర చర్చకు తావిచ్చింది. అయితే విజయ్ సేతుపతి రాజకీయాల్లో లేకపోయినా ఇదివరకూ రజనీకాంత్ - కమల్ హాసన్ వంటి వారికి మద్ధతు పలుకుతూ జల్లికట్టు వివాదం - తమిళ రైతుల వివాదంలో తనవంతుగా గళం విప్పారు. ఆ క్రమంలోనే అతడిపై మోదీ ప్రభుత్వం ఐటీ దాడులు చేయించిందన్న చర్చా సాగుతోంది. ప్రస్తుతం విజయ్ అభిమానుల్లో సాగుతున్న ఆసక్తికర చర్చ ఇది.
అయితే ఈ దాడి కేవలం విజయ్ తో అంతం కాదు. అటు తమిళనాడులో - ఇటు తెలుగు రాష్ట్రాల్లో పాలిటిక్స్ కి అనుబంధంగా ఉన్న సెలబ్రిటీలందరికీ ఝలక్ తినిపించే ఛాన్సుందని అంచనా వేస్తున్నారు. టాలీవుడ్ పై ఐటీ దాడులు చేయడం కొత్తేమీ కాదు.. కానీ ఎన్నికల ముంగిట భాజపా కుట్రల్ని సౌత్ రాష్ట్రాలు - తెలుగు రాష్ట్రాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని - అందులో భాగంగానే టాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు ఐటీ ఎటాక్స్ జాబితాలో ఉన్నాయని ఫిలింసర్కిల్స్ లో మాట్లాడుకోవడం వేడి పెంచుతోంది. అయితే ఇందులో వాస్తవం అవాస్తవం మాట అటుంచితే పలువురు టాలీవుడ్ స్టార్లు ఈ ఏడాది రాజకీయాల్లోకి ప్రవేశించి వేడి పెంచుతున్నారు. ఇప్పటికే పవన్ - బాలకృష్ణ - చిరంజీవి లాంటి స్టార్లు రాజకీయాల్లో ఉన్న సంగతి తెలిసిందే. పలువురు స్టార్లు పాలిటిక్స్‌లోకి ఎంటర్ అవుతున్నారు. విజయ్ సేతుపతితో మొదలైంది. ఇది అందరికీ వార్నింగ్ అంటూ మాటా మంతీ సాగుతోంది.