Begin typing your search above and press return to search.

పెరిగిన ఓటీటీ ప్లాట్‌ఫాం యూజర్స్, ఎంతలా అంటే..?

By:  Tupaki Desk   |   21 Jan 2023 2:30 AM GMT
పెరిగిన ఓటీటీ ప్లాట్‌ఫాం యూజర్స్, ఎంతలా అంటే..?
X
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫాంలలో దూసుకుపోతుంది. 2023 మొదటి త్రైమాసికంలో ఏకంగా 14.4 మిలియన్ల మంది కొత్త సబ్‌స్క్రైబర్స్‌ను ఆకర్షించింది. 2023 మొదటి త్రైమాసికంలో కొత్తగా 14.4 చందాదారులు వచ్చినట్లు డిస్నీ ప్లస్ నివేదించింది. డిస్నీ ప్లస్ మొత్తం చందాదారుల సంఖ్య 236 మిలియన్లుగా ఉందని చెప్పింది. ఇందులో డిస్నీ ప్లస్ - 164 మిలియన్లు, హూలూ - 47 మిలియన్లు, ఈఎస్పీఎన్ - 24 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

మరోవైపు ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ మాత్రం తమ ఫ్లాట్‌ఫాంను కొత్తగా 7.6 మిలియన్ల మంది మాత్రమే సబ్‌స్క్రైబ్ చేసుకున్నట్లు వెల్లడించింది. నెట్ ఫ్లిక్స్ కు మొత్తం 231 సబ్‌స్కైబర్లు ఉన్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

ఈ స్ట్రీమింగ్ దిగ్గజం గతేడాది నవంబర్ లో నెలకు రూ. 149 కే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకువచ్చింది. ఇందులో ప్రకటనలు కూడా వస్తుంటాయి. దీంతో నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త చందాదారులు పెరిగినట్లు తెలుస్తోంది. ఇంతకాలం ప్రకటనలకు దూరంగా ఉంటూ వచ్చిన నెట్‌ఫ్లిక్స్ తప్పనిసరి పరిస్థితుల్లో నష్టాల భారం తగ్గించుకునేందుకు ప్రకటనలతో కూడిన ప్లాన్ తీసుకువచ్చింది.

గతేడాది నాలుగో త్రైమాసికంలో నెట్‌ఫ్లిక్స్ రూ.785 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంటే సంవత్సరానికి 1.9 శాతం వృద్ధిని నెట్‌ఫ్లిక్స్ అందుకుంటోంది. నిర్వహణ ఆదాయం రూ. 55 కోట్లుగా ఉండగా అది ఇంకా తగ్గాల్సి ఉందని నివేదికలు చెబుతున్నాయి. నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సహా ఇతర ఓటీటీ ప్లాట్‌ఫాంలకు భారత్‌లో 42.4 కోట్ల మంది చందాదారులు ఉన్నారు.

ఈ సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 10 మంది వ్యక్తుల్లో ముగ్గురు నెలలో కనీసం ఒక్కసారైనా ఆన్‌లైన్‌లో వీడియోలు చూస్తున్నట్లు ఆర్మాక్స్ అధ్యయనంలో వెల్లడైంది.

భారత్‌లోని మెట్రో నగరాల్లో దాదాపు 79 శాతం మంది ఓటీటీ వాడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కొత్త చందాదారుల కోసం ఓటీటీలు చిన్న మార్కెట్లపై ఆధారపడాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.