Begin typing your search above and press return to search.

నష్టాల నుంచి గట్టెక్కాలంటే అదొక్కటే మార్గం..!

By:  Tupaki Desk   |   9 Nov 2020 11:30 PM GMT
నష్టాల నుంచి గట్టెక్కాలంటే అదొక్కటే మార్గం..!
X
కరోనా లాక్ డౌన్ కారణంగా మూతపడిపోయిన థియేటర్స్ రీ ఓపెన్ చేసుకోడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అక్టోబర్ 15 నుంచే 50 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతో తెరుచుకోమని సూచించింది. దీంతో థియేటర్స్‌ ఓనర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా థియేటర్స్ తెరవలేదు. పలు రాష్ట్రాల్లో కొన్ని మల్టీప్లెక్సెస్ ఓపెన్ చేసి కొత్త సినిమాలు లేకపోవడంతో ఓల్డ్ మూవీస్ ని ప్రదర్శించారు. కర్ణాటకలో బెంగుళూరు.. ఏపీలో విజయవాడ - విశాఖపట్నం వంటి ప్రాంతాలలో సినిమాలు రిలీజ్ చేశారు. కాకపోతే ఇప్పటివరకు అందరూ అనుకున్నట్లే ఆశించిన స్థాయిలో ఆడియెన్స్ థియేట‌ర్స్ కు రాలేదని తెలుస్తోంది.

ఆడియన్స్ నుంచి స్పందన కరువవడంతో పలు ఏరియాలలో ఓపెన్ చేసిన థియేటర్స్ మళ్ళీ క్లోజ్ చేశారు. కరోనా తీవ్రత ఇంకా తగ్గకపోవడంతో లైఫ్ రిస్క్ చేసి ఎంటెర్టైన్మెంట్ కోసం థియేటర్లకు రావడానికి ప్రేక్షకులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు జనాలు థియేటర్స్ కు రాకపోవచ్చనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో గత ఎనిమిది నెలలుగా నష్టాలను ఎదుర్కుంటున్న థియేటర్స్‌ ఓనర్స్ - ఎగ్జిబిటర్స్ - డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్స్ రన్ చేస్తే కనీసం మెయింటనెన్స్ కి కూడా మనీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో వారు క్రైసిస్ నష్టాల నుంచి గట్టెక్కాలంటే సీటింగ్ ఆక్యుపెన్సీ పెంచడమో లేదా టికెట్ ధరలు పెంచడమో చేయాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.