Begin typing your search above and press return to search.
ఈ వీకెండ్ వసూళ్లు గోవిందానే
By: Tupaki Desk | 11 Jun 2019 2:30 PM GMTఒకపక్క ఎండలతో సినిమాల కలెక్షన్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. కంటెంట్ ఉంటే తుఫాను వచ్చినా ప్రేక్షకులు ధియేటర్ కు వస్తారు కాని అంత సీన్ ఉన్నవి లేక ఇళ్ళకే పరిమితమవుతున్నారు. ఇప్పుడీ 14న మొత్తం మూడు బాషలు తెలుగు-హింది-ఇంగ్లీష్ కలిపి 12 సినిమాలు రిలీజ్ కానుండటం పట్ల ఒకపక్క ట్రేడ్ లో ఉత్సాహంగానే ఉన్నా మరోపక్కా ఏదీ క్రేజ్ ఉన్నది కాకపోవడం టెన్షన్ పెడుతోంది.
ఇదిలా ఉండగా ఇన్నేసి వస్తున్నాయి కాబట్టి వీకెండ్ కలెక్షన్స్ ఇవి సేఫ్ అవ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాని ఇప్పుడు ఆ ఛాన్స్ తక్కువనే చెప్పాలి. కారణం ఆదివారం జూన్ 16న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉండటమే. ఎప్పుడెప్పుడా అని క్రికెట్ లవర్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడోఓసారి మ్యాచులు చూసేవాళ్ళు సైతం ఆ రోజుని ఖాళీగా ఉంచుకుంటున్నారు
ఈ నేపధ్యంలో కీలకమైన ఈ వరల్డ్ కప్ మ్యాచ్ వసూళ్ళకు గండి కొట్టడం ఖాయమే. ఉదయం షోలు కొంతవరకు వర్క్ అవుట్ అయినా మధ్యాన్నం 3 కి సరిగ్గా మ్యాచ్ ప్రారంభమై సెకండ్ షో అయిపోయే సమయానికి ముగుస్తుంది కాబట్టి మూడు ఆటల లెక్కల్లో తేడాలు వచ్చేస్తాయి. అందరూ చూస్తారని కాదు కాని ఎంతలేదన్నా 60 నుంచి 70 శాతం దాకా దీని ప్రభావమైతే ఖచ్చితంగా ఉంటుంది.
అందులోనూ సెలవు రోజు కాబట్టి దర్జాగా ఇంట్లోనే తిష్ట వేసుకుని ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్నారు పబ్లిక్. చాలా చోట్ల స్క్రీన్లు వేసి మరీ దీన్ని ప్రసారం చేయబోతున్న క్లబ్బులు రెస్టారెంటులు కూడా ఉన్నాయి. అఫ్ కోర్స్ వీటికి మాత్రం బుకింగ్స్ జోరుగా ఉన్నాయి లెండి. సో 14న అదృష్టాన్ని పరీక్షించుకోనున్న చిన్నా చితకా సినిమాలకు ఆదివారం దెబ్బ వేయడం ఖాయమే