Begin typing your search above and press return to search.
ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ఓటీటీ డెబ్యూ
By: Tupaki Desk | 12 Sep 2021 9:30 AM GMTమూడు నాలుగు సంవత్సరాల క్రితం ఇండియాలో ఓటీటీ గురించి పెద్దగా చర్చ లేదు. హాలీవుడ్ సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు మాత్రమే ఓటీటీలో స్ట్రీమ్ అవుతూ ఉండేవి. ఇండియాలో చాలా తక్కువ మంది ఓటీటీ అవగాహణ కలిగి ఉండేవారు. అతి తక్కువ సమయంలోనే పల్లెటూరు వాళ్లు.. మినిమం ఎడ్యుకేషన్ ఉన్న వారు కూడా ఇప్పుడు ఓటీటీని వినియోగిస్తున్నారు. అతి తక్కువ సమయంలో ఇండియాలో ఓటీటీ విప్లవం వచ్చింది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా కరోనా కారణంగా గత ఏడాది నుండి ఇప్పటి వరకు ఓటీటీ వినియోగం వందల రెట్లు పెరిగింది. కరోనాకు ముందు వరకు చిన్న చిన్న తారలు మాత్రమే ఓటీటీలో సినిమాలు చేసేవారు.. కొత్త వారు ఫేడ్ ఔట్ అవుతున్న వారు మాత్రమే వెబ్ సిరీస్ ల్లో కనిపించే వారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. స్టార్స్ నుండి సూపర్ స్టార్స్ వరకు కూడా ఓటీటీ లో కనిపించేందుకు సిద్దం అవుతున్నారు.
రెగ్యులర్ సినిమాలకు మరియు స్టార్ హీరోల సినిమాలకు ఏమాత్రం తక్కువ కాకుండా బడ్జెట్ విషయంలో భారీతనం ఉంటున్న ఓటీటీ కంటెంట్ కు ప్రేక్షకుల్లో ఆధరణ కూడా భారీగా ఉంటుంది. అందుకే పెద్ద హీరోలు ఓటీటీ దారి పడుతున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యాయి. కొందరు స్టార్స్ వెబ్ సిరీస్ ల్లో నటించారు. ఇప్పటి వరకు ఇండియన్ సినీ ప్రముఖులు ఎంతో మంది వెబ్ సిరీస్ ల్లో నటించారు. మొదటి సారి ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్దం అవుతున్నాడు. ఇంత పెద్ద స్థాయి స్టార్ వెబ్ సిరీస్ లో నటించడం ఇదే మొదటి సారి అవ్వడంతో ముందు ముందు మరెంతో మంది ఓటీటీ డెబ్యూ ఇవ్వడం కన్ఫర్మ్ అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.
షారుఖ్ ఖాన్ గత కొంత కాలంగా ఆశించిన స్థాయిలో సక్సెస్ లను దక్కించుకోలేక పోతున్నాడు. ఈయన చివరిగా జీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆ సినిమా దెబ్బతో షారుఖ్ ఖాన్ దాదాపుగా మూడు సంవత్సరాల పాటు ప్రేక్షకులకు దూరం అయ్యాడు. ఎట్టకేలకు పఠాన్ అనే సినిమాను చేస్తున్నాడు. ఎన్ని ప్లాప్స్ పడ్డా.. మూడేళ్లు దూరంగా ఉన్నా కూడా షారుఖ్ కు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు షారుఖ్ ఖాన్ తో అతి భారీ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తుంది.
స్క్రిప్ట్ తో పాటు అన్ని విషయాల్లో కూడా షారుఖ్ ఖాన్ సంతృప్తి చెందడటంతో అతి త్వరలోనే వెబ్ సిరీస్ పట్టాలెక్కబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రెండు మూడు వారాల్లో ఈ వెబ్ సిరీస్ ను అధికారికంగా ప్రకటించబోతున్నారు. రెండు మూడు సినిమాలు చేస్తూనే మరో వైపు ఈ వెబ్ సిరీస్ ను కూడా చేయబోతున్నాడు. ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్ ఎవరు మరియు ఈ వెబ్ సిరీస్ ఇతర విషయాల గురించి తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు ఈ వెబ్ సిరీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.