Begin typing your search above and press return to search.
కరోనా లాక్ డౌన్ పై జాతీయ అవార్డ్ దర్శకుడి సినిమా
By: Tupaki Desk | 18 Nov 2022 3:21 PM GMTకరోనా లాక్ డౌన్ సన్నివేశం ఇప్పటికీ భారతదేశ ప్రజల కంటి ముందు నుంచి ఇంకా అదృశ్యం కాలేదంటే అతిశయోక్తి కాదు. అది ఎన్నటికీ మాయని గాయం. మాయదారి మహమ్మారీ చైనా నుంచి భారత్ లో అడుగుపెట్టిందని దీనిని నిలువరించాలంటే దేశంలోని రవాణా వ్యవస్థ సహా అన్ని వ్యవస్థలను స్థంబింపజేయాలని మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ప్రకటన వెలువడిన కొద్ది క్షణాల్లోనే ప్రజల బతుకుల్లో కల్లోలం మొదలైంది. ఎంత ప్రయత్నించినా కరోనాను ఎవరూ ఆపలేకపోయారు. ఇక వైరస్ భారతదేశంలోను మరణ మృదంగం మోగించింది.
అయితే దానిని మించి ఆకస్మిక లాక్ డౌన్ ప్రజల పాలిట శాపంగా మారింది. అప్పట్లో పొరుగు ప్రాంతాలకు వలస పోయిన కార్మికులు తిరిగి తమ ఇళ్లకు చేరుకునే లోగానే వారిలో చాలామంది అనంత లోకాలకు చేరిపోయారు. ప్రభుత్వం కనీస సమాచారం ఇవ్వకుండా లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో వలస కార్మికులు తమ ఇండ్లకు వెళ్లలేక పట్టణంలో జీవించలేక ఉపాధి లేక విలవిలలాడారు. వలస కార్మికులు... సెక్స్ వర్కర్లు సహా చాలా మంది బడుగు జీవుల దృక్కోణం నుండి కోవిడ్ లాక్ డౌన్ ల భయానక పరిస్థితులను ఇప్పుడు వెండితెరకెక్కించే ప్రయత్నం సాగుతోంది. జాతీయ అవార్డ్ గ్రహీత మధుర్ భండార్కర్ `ఇండియా లాక్ డౌన్` పేరుతో మూవీ తీస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది.
ఇండియా లాక్‌డౌన్ ట్రైలర్: ది హారర్స్ ఆఫ్ పాండమిక్ పేరుతో ట్రైలర్ విడుదల కాగా క్షణాల్లోనే అంతర్జాలంలో వైరల్ అయ్యింది. 2020లో కోవిడ్-19 రెండు సార్లు లాక్ డౌన్ లకు కారణమైంది Zee5 చిత్రం తారాగణంలో శ్వేతా బసు ప్రసాద్- ప్రతీక్ బబ్బర్- అహనా కుమ్రా- సాయి తమంకర్- ప్రకాష్ బెలవాడి తదితరులు నటించారు. మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 2న జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
పైలట్-సెక్స్ వర్కర్- రోజువారీ కూలీ- ఇంటి పనివాడు ఇలా ప్రతి ఒక్కరి జీవితాల్లో కోవిడ్ కల్లోలం ప్రభావం ఎంత? కోవిడ్-19 లాక్ డౌన్ పరిణామాలపై ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నించే ఇలాంటి విభిన్న పాత్రలతో దాదాపు రెండున్నర నిమిషాల ట్రైలర్ ప్రారంభమవుతుంది. అహానా అనే పైలట్ మొదట పొరుగు కుర్రాడితో సరసాలాడుతుంది. అయితే వలస కార్మికుడైన ప్రతీక్ బబ్బర్ అతని భార్య.. హౌస్ కీపర్ సాయి.. లాక్ డౌన్ ముగిస్తే త్వరలో పనికి తిరిగి వెళ్లగలమని ఆశిస్తారు. 21 రోజుల్లో దీనిని ప్రభుత్వం ఎత్తేస్తుందని భావిస్తారు.
కానీ వారంతా ఎంత ప్రయత్నించినా లాక్ డౌన్ కొనసాగుతూనే ఉన్నందున కుటుంబ భారం పెనుభారంగా మారుతుంది. అన్ని ఖర్చులు ఎలా భరించాలో.. మనుగడ సాగించడమెలానో అర్థం కాని ధైన్యంలోకి వెళ్లిపోతారు. కోవిడ్-19 ఫలితంగా శారీరక సంబంధం పరిమితం కావడంతో సెక్స్ వర్కర్ గా నటించిన శ్వేతా బసు ప్రసాద్ డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను కనుగొంటుంది. అద్దె కట్టలేక ఆదాయ వనరులు లేని పెద్ద నగరంలో బతకలేక ప్రతీక్- సాయి వారి పిల్లలు వందల కిలోమీటర్లు ప్రయాణించి స్వగ్రామానికి చేరుకుంటారు. ఇలా ప్రతిదీ రియలిస్టిక్ గా ఎంతో హృద్యంగా ట్రైలర్ లో మధుర్ భండార్కర్ ఆవిష్కరించారు. జాతీయ అవార్డు గ్రహీతగా ఆయన తనదైన శైలిలో ఈ చిత్రాన్ని మలిచారని ట్రైలర్ భరోసానిచ్చింది.
అయితే లాక్ డౌన్ పర్యవసానాన్ని ఇప్పుడిప్పుడే ప్రజలు మర్చిపోయి తిరిగి సాధారణ జీవితంలోకి వస్తున్నారు. ఇలాంటి సమయంలో లాక్ డౌన్ పై సినిమా ఆసక్తిని పెంచుతుందా లేదా? అన్నది వేచి చూడాలి. కథనంలో గ్రిప్ తో పాటు ఎమోషన్ రగిలించగలిగితే సినిమా హిట్టవుతుందనడంలో సందేహం లేదు.
ఈ మూవీలో నటించిన తారాగణంలో సాయి 2021 చిత్రం మిమీలో అరంగేట్రం చేయగా.. శ్వేతబసు ప్రసాద్ ఇటీవల డిస్నీ+ హాట్‌స్టార్ `క్రిమినల్ మైండ్స్`లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడ్వకేట్ గా తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమాతో పాటు డిసెంబర్ లో విడుదల కానున్న మరో చిత్రం సలామ్ వెంకీలో అహానా కుమ్రా కాజోల్ తో కలిసి నటించనుంది. ప్రతీక్ బబ్బర్ చివరిగా `కోబాల్ట్ బ్లూ` చిత్రంలో టైటిల్ రోల్ లో నటించాడు. ఇటీవల నటుడు ప్రకాష్ బెలవాడి ప్రసిద్ధ కన్నడ టెలివిజన్ కార్యక్రమంలో హంబుల్ పొలిటీషియన్ నోగరాజ్ పాత్రను పోషించాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.