Begin typing your search above and press return to search.

రెడ్డిగారి పేరు మీద స్టాంపేశారు

By:  Tupaki Desk   |   24 Feb 2018 7:38 AM GMT
రెడ్డిగారి పేరు మీద స్టాంపేశారు
X
మిస్సమ్మ - పాతాళ భైరవి అలాగే మాయాబజార్ - గుండమ్మ కథ సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక చెరగని ముద్ర వేశాయని చెప్పాలి. ముఖ్యంగా మాయాబజార్ అయితే అప్పట్లో మన ప్రేక్షకులకు గొప్ప విజువల్ వండర్. కెమెరా తో సరికొత్త యాంగిల్స్ సెట్ చేసి గ్రాఫిక్స్ మాయాజాలాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. అయితే అలాంటి ప్రయోగాత్మకమైన సినిమాలను నిర్మించాలంటే నిర్మాతకి దైర్యం చాలా అవసరం.

ఆ దైర్యం కలవారు ఆ చిత్ర నిర్మాత బి.నాగి రెడ్డి గారు. దర్శకుల పనితనాన్ని మెచ్చి సినిమాను అద్భుతంగా నిర్మించే ఆయన ఎన్నో మధురమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు. ఆయనతో పాటు చక్రపాణి గారు కూడా విజయ వారి ప్రొడక్షన్ లో సహా నిర్మాతగా వ్యవరించారు. చెన్నై లో విజయ హాస్పిటల్స్ ని కూడా ఆయన నిర్మించారు. ఇక 2004 ఆయన మరణించిన సంగతి తెలిసిందే.

అయితే రీసెంట్ గా బొమ్మి రెడ్డి నాగిరెడ్డి గారి గుర్తుగా పోస్టేజ్ స్టాంప్ ను ఆవిష్కరించారు. చెన్నై లో వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. ప్రభుత్వ అధికారులతో పాటు కొంత మంది సినీ ప్రముఖులు కూడా వేడుకలో పాల్గొన్నారు. నాగిరెడ్డి గారి గురించి ప్రముఖులు మాట్లాడి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.