Begin typing your search above and press return to search.
కోటి కాదు కానీ 2-3 కోట్ల కేసులు షురూ!-తేజ
By: Tupaki Desk | 13 Jun 2020 4:00 AM GMT``భారతదేశంపై నాకున్న జ్ఞానం ప్రకారం.. భారతీయుల వైఖరిని అనుసరించి కొవిడ్ 19 కేసుల్లో భారతదేశం నంబర్ 1 అయ్యి తీరుతుంది. అది మనకు లభించే చెత్త స్థానం. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో మహమ్మారి కేసులు భారతదేశంలో ఉంటాయనడంలో డౌట్ లేదు. కోటి కాదు కానీ 2-3 కోట్ల కేసులు ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు`` అని అంటున్నారు దర్శకుడు తేజ.
``కేసులు తక్కువ ఉన్నప్పుడు లాక్ డౌన్ పాటించాం. అమాంతం అడవి మంటలా వ్యాపిస్తున్నప్పుడు దావానలంలా చుట్టేస్తున్నప్పుడు లాక్ డౌన్ ఎత్తేశాం. మన వాళ్ల వ్యవహారం తెలిసీ చెబుతున్నా. మహమ్మారివైరస్ కేసుల సంఖ్య ఇక ఆగదు. అవి విపరీతంగా పెరగవచ్చు. ఇప్పుడు, కేసుల సంఖ్య రోజూ 11 లేదా 12 వేల వరకు ఉంది. అవి లక్ష వరకు పెరుగుతాయి. ఈ సంఖ్య 30 లక్షలు.. 1 కోటి వరకు ఉండవచ్చు`` అని తన అభిప్రాయం కుండ బద్ధలు కొట్టేశారు.
``నాకు మహమ్మారివైరస్ లేదు. నేను కలుసుకున్న వ్యక్తికి మహమ్మారి లేదు. సూపర్ మార్కెట్ కి వెళితే.. కొన్ని వస్తువులను కొని మహమ్మారిను తేలేదు`` అనుకుంటూనే బుట్టలో పడతాము. ``కూరగాయలకు మహమ్మారి ఉండదు. కూరగాయల విక్రేతకు మహమ్మారి ఉండదు. వస్తువులన్నింటినీ తెచ్చి మా డైనింగ్ టేబుల్ లేదా సోఫా మీద లేదా వంటగదిలో ఉంచుతాం. నాకు మహమ్మారి లేదని.. విక్రేతకు మహమ్మారి లేదని.. వస్తువులకు మహమ్మారి లేదని గట్టిగా నమ్ముతున్నాం`` ఇది పూర్తిగా తప్పు. మహమ్మారి ఉంది. మహమ్మారి ప్రతిచోటా ఉందని అనుకోవాలి. మహమ్మారి వ్యాప్తిని మనం నిజంగా ఆపాలనుకున్నప్పుడు.. ప్రతిఒక్కరికీ మహమ్మారి ఉందని.. ప్రతి వస్తువుకు మహమ్మారి ఉందని మనం భావించాలి అని అన్నారు తేజ.
కొనుగోళ్లకు మీ కార్డు ఇస్తున్నప్పుడు.. కార్డును స్వైప్ చేసే వ్యక్తికి మహమ్మారి ఉందని నమ్మండి. కూరగాయల విక్రేతకు మహమ్మారి ఉందని నమ్మినట్టే ప్రతిఒక్కరికీ మహమ్మారి ఉందని.. వారివల్ల మీకు మహమ్మారి వైరస్ సోకుతుందని నమ్మాలి. నేను ఇంటికి వెళితే.. నా కుటుంబం మహమ్మారి బారిన పడుతుంది. ప్రతి ఒక్కరినీ రక్షించడానికి ప్రతి దశలో వస్తువులను.. మీ చేతులను శుభ్రపరచండి`` అని సూచించారు. కెరీర్ సంగతి చూస్తే.. దర్శకుడు తేజ ప్రస్తుతం ఓ రెండు చిత్రాలకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాస్టింగ్ సెలక్షన్ సాగుతోంది.