Begin typing your search above and press return to search.

వావ్... బాలయ్య మీద స్పెషల్ ఎడిషన్

By:  Tupaki Desk   |   10 Jan 2016 10:44 AM GMT
వావ్... బాలయ్య మీద స్పెషల్ ఎడిషన్
X
తెలుగు హీరోల్లో అతి కొద్ది మంది మాత్రమే దక్కించుకున్న గౌరవాన్ని నందమూరి బాలకృష్ణ కూడా దక్కించుకోబోతున్నాడు. బాలయ్య మీద ప్రముఖ ఇండియ టుడే మ్యాగజైన్ ఓ స్పెషల్ ఎడిషన్ తీసుకురానుంది. బాలయ్య 99 సినిమాలు పూర్తి చేసుకుని.. త్వరలోనే వందో సినిమా మైలురాయిని అందుకోబోతున్న నేపథ్యంలో ఇండియా టుడే ఈ బృహత్తర ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ఒక ఎడిషన్ పూర్తిగా బాలయ్య వార్తలతోనే కళకళలాడబోతోంది. అందులో బాలయ్య సినీ కెరీర్లోనే మైలురాళ్ల గురించి.. ఆయన పేరిట ఉన్న కలెక్షన్ల, సెంటర్ల రికార్డులతో పాటు కొన్ని స్పెషల్ మూవీస్ గురించి ప్రత్యేక కథనాలు వెలువరిస్తన్నారు.

ఎన్టీఆర్ తో బాలయ్య అనుంబంధం గురించి.. బాలయ్య పొలిటికల్ కెరీర్ గురించి.. కూడా ఇందులో ప్రస్తావన ఉంటుంది. బాలయ్య ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యే కూడా అన్న సంగతి తెలిసిందే. బాలయ్యతో స్పెషల్ ఇంటర్వ్యూలో కూడా ప్రచురించబోతున్నారు. తన వందో సినిమాకు సంబంధించిన విశేషాల్ని కూడా నందమూరి హీరో ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారట. ఇంతకుముందు టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కింగ్ నాగార్జునల మీద మాత్రమే ‘ఇండియా టుడే’ ఇలా స్పెషల్ ఎడిషన్లు తీసుకొచ్చింది. బాలయ్య కూడా వారి సరసన చేరబోతున్నాడిప్పుడు.