Begin typing your search above and press return to search.
జీవితం క్షణ భంగురం.. ఒణికిపోయిన కాజల్!
By: Tupaki Desk | 21 Feb 2020 4:30 AM GMTజీవితం క్షణ భంగురం .. ప్రాణం విలువ.. లైఫ్ విలువ తెలిసొచ్చింది! అంటూ ఎంతో ఆవేదనను వ్యక్తం చేసింది చందమామ కాజల్. భారతీయుడు 2 సెట్స్ లో ఈ బుధవారం సాయంత్రం జరిగిన దుర్ఘటనలో ఏకంగా ముగ్గురు మరణించడం.. పది మందిపైగా క్రేన్ కింద పడి నలిగి పోవడం తనని కలచి వేసిందని కాజల్ తెలిపింది. మరో షాకింగ్ మ్యాటర్ ఏమంటే.. ఆ స్పాట్ లో కమల్ హాసన్ - కాజల్ కూడా క్రేన్ పైనుంచి పడేప్పుడు ఉన్నారట. రెప్ప పాటులో వీళ్లు ఆ ప్రమాదం నుంచి మిస్సయ్యారని తెలుస్తోంది.
అందుకే ఇలా వేదాంత ధోరణి తో మాట్లాడుతూ కాజల్ ఒణికి పోయింది. ఆ ప్రమాదం జరిగినప్పుడు సమీపంలో ఉన్న కాజల్- కమల్ హాసన్ - డిజైనర్ అమృత రామ్ లు కొద్దిలోనే తప్పించుకున్నట్లు సెట్ లోని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత కమల్ హాసన్ తీవ్ర ఆవేదనతో మరణించినవారికి వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఇతర తారాగణం .. సిబ్బంది తో పాటు తాను దుఃఖం లో ఉన్నానని కమల్ చెప్పారు.
షాక్ నుండి ఇంకా పూర్తిగా కోలుకోని కాజల్ అగర్వాల్ ట్విట్టర్ లో ఒక వ్యాఖ్యను పోస్ట్ చేశారు. ``నిన్న రాత్రి జరిగిన భయంకరమైన క్రేన్ ప్రమాదం చాలా షాక్ కి గురి చేసింది. ట్రామాలోకి వెళ్లిపోయాను. గుండెకు గాయం చేసింది. సజీవంగా ఉన్నానని చెప్పేందుకే ఈ ట్వీట్ ను టైప్ చేశాను. అందుకు సెకను మాత్రమే పట్టింది. ఆ ఒక్క క్షణం.... జీవితం విలువ.. టైమ్ విలువ తెలిసింది. చాలా నేర్చుకున్నాను`` అంటూ ఆవేదనగా మాట్లాడింది కాజల్. భారతీయుడు 2 చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ ఈ సంఘటనకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది. కన్నుమూసిన ముగ్గురు వ్యక్తుల వివరాలను తాజాగా వెల్లడించింది. దర్శకుడు శంకర్ కూడా గాయ పడినట్లు పుకార్లు వచ్చాయి. అయితే అది తప్పుడు ప్రచారమేనని సెట్ వర్గాలు ఖండించాయి.