Begin typing your search above and press return to search.
RC 15 కు సంకటంగా కమల్ మూవీ!
By: Tupaki Desk | 31 Jan 2023 4:40 PM GMTఒకేసారి రెండు పడవలపై ప్రయాణం చేయడం ప్రాణంతో చెలగాడం ఆడటమే అవుతుంది. ఏది కొంచెం బ్యాలెన్స్ తప్పినా మొదటికే మోసం అవుతుందన్నది తెలిసిందే. ఇలా రెండు పడవల ప్రయాణం చేస్తూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడు దర్శకుడు శంకర్. 1996లో కమల్ హీరోగా విడుదలై సంచలనం సృష్టించిన మూవీ 'ఇండియన్'. ఇదే సినిమాని తెలుగులో 'భారతీయుడు' పేరుతో విడుదల చేశారు. హిందీలోనూ సంచలనాలు సృష్టించిన ఈ మూవీకి తాజాగా శంకర్ ఇన్నాళ్లకు 'ఇండియన్ 2' పేరుతో సీక్వెల్ ని తెరకెక్కిస్తున్నారు.
సెట్ లో క్రేన్ యాక్సిడెంట్ కావడం.. ముగ్గురు సిబ్బంది చనిపోవడంతో లైకా ప్రొడక్షన్స్ వారికి, శంకర్ కు మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో సినిమా షూటింగ్ ని మధ్యలోనే నిలిపి వేశారు. ఆ తరువాత శంకర్ టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తో RC 15 కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దిల్ రాజు, శిరీష్త్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో ఎస్.జె. సూర్య, జయరామ్, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి నటిస్తున్నారు.
రాకెట్ స్పీడుతో ఈ మూవీకి సంబంధించిన కీలక షెడ్యూల్స్ ని రాజమండ్రి, హైదరాబాద్, అమృత్ సర్ లలో పూర్తి చేశారు. అయితే కమల్ ఎప్పుడైతే 'ఇండియన్ 2'ని మళ్లీ లైన్ లోకి తీసుకొచ్చాడో అప్పటి నుంచి RC 15 కు కష్టాలు మొదలయ్యాయట.
ఈ మూవీ షూటింగ్ గత కొంత కాలంగా నత్తనడకన సాగుతున్నట్టుగా తెలుస్తోంది. 'ఇండియన్ 2' కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆలస్యం అవుతూ వుండటంతో శంకర్ పై తీవ్ర ఒత్తిడి పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది.
'ఇండియన్ 2' షూటింగ్ ప్రస్తుతం ఏపీలోని గండికోటలో జరుగుతోంది. అక్కడ కమల్ పాల్గొనగా పలు కీలక ఘట్టాలని శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ షెడ్యూల్ పూర్తయితే కానీ శంకర్ RC 15 కొత్త షెడ్యూల్ ని మొదలు పెట్టలేడు. శంకర్ సినిమా కదా అని ప్రెస్టేజియస్ గా ఫీలైన దిల్ రాజు కు ఈ మూవీ షూట్ ఆలస్యం వల్ల భారీగా వడ్డీలు పెరిగిపోతున్నాయట. వచ్చే ఏడాది సంక్రాంతికి ఎట్టపరిస్థితుల్లోనూ ఈ మూవీని రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేసుకుంటున్నాడు.
కానీ 'ఇండియన్ 2' కారణంగా ఆలస్యం అవుతుందనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. శంకర్ తొలి సారి రెండు పడవల ప్రయాణం చేస్తుండటంతో ఆయనకు ఇది బిగ్ టెన్షన్ తో కూడుకున్న టాస్క్ గా మారినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మరి ఈ బిగ్ టాస్క్ ని శంకర్ అనుఏకున్నట్టుగానే గట్టెక్కేనా..?. RC 15 ని సంక్రాంతి బరిలో నిలిపేనా? అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.