Begin typing your search above and press return to search.
కోట్ల నష్టపరిహారం రాజీ కోసమా?
By: Tupaki Desk | 22 Feb 2020 5:31 AM GMT‘ఇండియన్ 2’ చిత్రం షూటింగ్ సందర్బం గా జరిగిన యాక్సిడెంట్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. శంకర్ సినిమా అంటే ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా అంతటా క్రేజ్ ను కలిగి ఉంటుంది. అలాంటి శంకర్ సినిమా అవ్వడంతో ఈ యాక్సిడెంట్ గురించి జాతీయ మీడియాలో సైతం ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది. ఇండియన్ 2 చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తుండగా ఇలాంటి ప్రమాదం జరగడం బాధాకరం. ఈ సమయంలో సినిమాకు సంబంధించి అనేక రకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి.
సినిమా షూటింగ్ యాక్సిడెంట్ లో చనిపోయిన ముగ్గురి కుటుంబ సభ్యులు ఎవరు కూడా పోలీసు కేసు పెట్టలేదు. కాని పోలీసులు స్వయంగా కేసు నమోదు చేసుకున్నారట. ఇప్పటికే యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంకు వెళ్లి చూసి తీసుకున్న జాగ్రత్తలు ఏంటీ.. టెక్నీషియన్స్ కు ఇచ్చిన సెక్యూరిటీ ఏంటీ అనే విషయాలను తెలుసుకున్నారట. నిర్మాత.. ప్రొడక్షన్ మేనేజర్.. క్రేజ్ ఓనర్ లపై కేసు నమోదు చేయడంతో పాటు దర్శకుడు శంకర్ ఇంకా కమల్ లకు నోటీసులు జారీ చేయడం జరిగిందట.
సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు అయ్యింది. భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టారు. కనుక సినిమా ఆగిపోవద్దనే ఉద్దేశ్యం తో నిర్మాణ సంస్థ ప్రమాదంలో చని పోయిన వారి కుటుంబాలతో పోలీసు కేసులు కాకుండా రాజీ కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. కమల్ హాసన్ ద్వారా వారి కుటుంబాలతో నిర్మాణ సంస్థ రాజీ కుదిర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ తమిళ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇన్ని చేసినా కూడా ఇండియన్ 2 చిత్రం మళ్లీ ప్రారంభం అయ్యేది ఎప్పుడో అర్థం కాని పరిస్థితి.