Begin typing your search above and press return to search.
మళ్ళీ లైన్ లోకి వస్తున్న ఇండియన్ 2 ?
By: Tupaki Desk | 16 May 2019 7:35 AM GMTలోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా 1996లో వచ్చిన బ్లాక్ బస్టర్ భారతీయుడు సీక్వెల్ ని ఎంతో ఆర్భాటంగా ఆ మధ్య ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే శంకర్ పెట్టించే ఖర్చుకు భయపడి నిర్మాణ సంస్థ లైకా దీన్ని ఆపేసిందనే టాక్ బలంగా వచ్చింది. దానికి బలంగా చేకూరేలా షూటింగ్ ఆగిపోవడం కమల్ కానీ శంకర్ కానీ దీని ప్రస్తావన ఎక్కడ తేకపోవడం అనుమానాలను బలపరిచింది.
చెన్నై టాక్ ప్రకారం శంకర్ మరోసారి లైకాతో సీరియస్ చర్చల్లో ఉన్నట్టు తెలిసింది. బడ్జెట్ కంట్రోల్ లోనే పెడతానని చెప్పిన టైంకి ఫినిష్ చేసి 2021 సంక్రాంతి రిలీజ్ కు హామీ ఇచ్చి మరీ ఒప్పించాడని వాటి సారాంశం. 2.0 విషయంలో ఇలాగే చెప్పి మాట తప్పి ఖర్చుని తడిసిమోపెడు చేసిన శంకర్ తో అగ్రిమెంట్ రాయించుకునే పనిలో ఉందట లైకా సంస్థ
ఇది కమల్ ఫాన్స్ కు పెద్ద న్యూసే. రాజకీయ ప్రచారంలో యమా బిజీగా ఉన్న కమల్ ప్రస్తుతం బిగ్ బాస్ 3 యాంకరింగ్ కు మాత్రమే కమిట్ అయ్యాడు. ఇండియన్ 2 ఒక కొలిక్కి వస్తోంది కాబట్టి ఓ ఏడాది పాటు దాని షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో మరో యూత్ హీరోని ఫైనల్ చేయాల్సి ఉంది. శంకర్ సినిమాల్లో చాలా ప్రత్యేకంగా నిలిచే భారతీయుడుకి కొనసాగింపుగా వచ్చే ఇండియన్ 2కి సైతం సుమారు 200 కోట్ల బడ్జెట్ అడిగాడట శంకర్. ఇప్పుడు దాన్ని గణనీయంగా తగ్గించే విధంగా ప్లాన్ చేస్తానని హామీ ఇవ్వడం వల్లే జూన్ చివరి వారం నుంచి ఇది పట్టాలు ఎక్కే ఛాన్స్ ఉంది