Begin typing your search above and press return to search.

కామెంట్‌: ఇక్కడున్నోళ్ళకి అవార్డులు రావా?

By:  Tupaki Desk   |   23 Jan 2016 7:30 AM GMT
కామెంట్‌: ఇక్కడున్నోళ్ళకి అవార్డులు రావా?
X
సంగీత మాంత్రికుడు ఏ.ఆర్‌.రెహ్ మాన్‌ - సౌండ్‌ డిజైనర్‌ రెసూల్‌ పూకుట్టీ - లిరిసిస్ట్‌ గుల్జార్‌.. ఈ ముగ్గురు మాత్రమే ఈ కొత్త తరంలో ఇండియా నుండి ఆస్కార్‌ అందుకున్న వారు. తక్కిన స్టార్లందరూ మన దేశంలో ఎన్నేసి కోట్లు ఏ విధంగా కలెక్ట్‌ చేసినా కూడా.. ఆస్కార్‌ అందుకునే స్థాయిని మాత్రం కనబరచట్లేదు. ఇకపోతే ఇదే కాదు.. అసలు ఇండియాలో ఉన్న చాలామందిని ఇప్పుడు ఒక సందేహం తొలిచేస్తోంది.

మైక్రోసాఫ్ట్‌ సిఇఓగా సత్యా నాదెళ్ల ఎంపికవ్వగానే మనం సంబరాలు చేసుకున్నాం. అలాగే గూగుల్‌ సిఇఓ గా సుందర్‌ పిచ్చయ్‌ ఎంపికవ్వగానే మనం ఆనందపడ్డాం. ఇప్పుడేమో.. మరో ఎన్నారై సాంకేతిక నిపుణుడు రాహుల్‌ థక్కర్‌, రిచర్డ్‌ చాంగ్‌ తో కలసి సంయుక్తంగా ఆస్కార్‌ గెలుచుకున్నాడు అంటూ హ్యాపీగా ట్వీట్లు వేస్తున్నాం. ఫేసుబుక్కులో పోస్టులు పెడుతున్నాం. కాని వీళ్లందరూ భారత్‌ ను వదిలేసి ఒక 25-30 సంవత్సరాలు అవుతోంది. అసలు ఇండియన్‌ సిటిజన్‌ షిప్‌ ను వదిలేసి అమెరికా పౌరసత్వం కూడా తీసేసుకున్నారు. అంటే ఇండియాకు ఎంత దూరంగా జరిగారో తెలుస్తోంది. కాని మనం వారి ఎచీవ్‌ మెంట్లనే సెలబ్రేట్‌ చేసుకుంటున్నాం కాని.. లోకల్‌ బాయ్స్‌ ఎవ్వరూ మనం సెలబ్రేట్‌ చేసుకునేంత సాధించట్లేదా??

పైగా వీళ్లందరి సక్సెస్‌ స్టోరీలు చూస్తుంటే.. అరే.. ఇండియా నుండి బయటకు వెళితేనే సక్సెస్‌ కొట్టి బీభత్సంగా పేరు తెచ్చకుంటాం అనే రాంగ్ సంకేతాలు కూడా ఇస్తోంది. ఏమంటారు?