Begin typing your search above and press return to search.
1000 మంది ప్రాణాలు కాపాడిన హీరోకి క్రికెటర్ హ్యాట్సాఫ్
By: Tupaki Desk | 22 Jan 2022 4:29 PM GMTటాలీవుడ్ స్టార్ హీరోల ధాతృ సేవామార్గం అన్నివిధాలా ప్రశంసించదగిది. కష్టంలో ప్రజల్ని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. మెగాస్టార్ చిరంజీవి- రామ్ చరణ్ .. నటసింహా నందమూరి బాలకృష్ణ సహా సూపర్ స్టార్ మహేష్ బాబు సేవాగుణంలో మేటి అని నిరూపించారు. ఇతర అగ్ర హీరోలు ప్రజల్ని కష్టకాలంలో ఆదుకుంటున్నారు.
ఇక సేవా మార్గంలో మహేష్ ఎంపిక చేసుకున్న విధానం చాలా విభిన్నమైనది. ఇప్పటికి అతడు ప్రముఖ హాస్పిటల్స్ తో కలిసి 1000 పైగా ప్రాణాల్ని కాపాడారు. వెయ్యిమందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు నిర్వహించేందుకు అవసరమయ్యే ఖర్చుల్ని భరించారు.
తాజాగా ఆహా వీడియోస్ లో అన్ స్టాపబుల్ విత్ బాలకృష్ణ కార్యక్రమంలో ఈ సేవలకు కారణమేమిటి? అన్న ప్రశ్న అడిగారు. దానికి మహేష్ చెప్పిన జవాబుకు హ్యాట్సాఫ్ అనకుండా ఉండలేం. తన కొడుకు గౌతమ్ ఆరువారాల ముందే పుట్టాడని.. పుట్టినప్పుడు తన చెయ్యి అంతే ఉన్నాడని అన్నారు మహేష్. ఇప్పుడు దాదాపు ఆరడుగులు ఉన్నాడు. మాకు డబ్బులున్నాయి కాబట్టి ఓకే.. లేనివాళ్ల పరిస్థితేంటి అనిపించింది. అప్పటినుంచి చిన్న పిల్లలకు సేవ చేస్తున్నానని మహేష్ తెలిపాడు. ఇది విన్న వెంటనే బాలయ్య మహేష్ ను మెచ్చుకున్నారు. ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది.
మహేష్ అభిమానులతో పాటు ఇతర రంగాల సెలబ్రిటీలు ఈ ప్రోమో వీక్షించాక ప్రశంసలు కురిపిస్తున్నారు. టీమిండియా క్రికెటర్ హనుమ విహారి ట్విట్టర్ ద్వారా మహేష్ కు హ్యాట్సాఫ్ చెప్పాడు. ఇది ఎంతో ఆదర్శవంతం.. వేయి మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించిన మహేష్ బాబు వావ్ అంటూ దండం పెట్టె ఈమోజీని.. చప్పట్లు కొట్టే ఈమోజీని షేర్ చేశారు. అతడి ట్వీట్ మహేష్ అభిమానుల్లో వైరల్ గా మారుతోంది.