Begin typing your search above and press return to search.
టాలీవుడ్ వైపు చూస్తున్న మిగతా సినీ ఇండస్ట్రీలు..!
By: Tupaki Desk | 13 Jan 2021 3:30 AM GMTకోవిడ్-19 కారణంగా కొన్ని నెలల పాటు షూటింగ్స్ నిలిచిపోవడంతో పాటు సినిమా థియేటర్స్ మూతబడ్డాయి. అయితే లాక్ డౌన్ సడలింపులలో భాగంగా షూటింగ్స్ కి పర్మిషన్ ఇవ్వడంతో పాటు.. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్స్ రీ ఓపెన్ చేసుకోవడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినప్పటికీ ఎవరూ షూటింగ్స్ చేసుకోడానికి ముందుకు రాలేదు.. థియేటర్స్ తెరుచుకోమని చెప్పినా కోవిడ్ భయంతో ఎవరూ థియేట్రికల్ రిలీజ్ చేయడానికి సాహసించలేదు. రిస్క్ తీసుకోవడం ఎందుకులే అని అందరూ తమ సినిమాలను డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ వేదికగా విడుదల చేసుకుంటూ వచ్చారు. అయితే ఒక్క టాలీవుడ్ మాత్రమే ధైర్యం చేసి సినిమాలను థియేట్రికల్ రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు.
'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాతో స్టార్ట్ చేసి ఈ సంక్రాంతికి క్రేజీ మూవీస్ ని రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో కొన్ని చిన్న సినిమాలతో పాటు ఆల్రెడీ ఓటీటీలో రిలీజైన సినిమాలను థియేటర్స్ లో రిలీజ్ చేశారు. సంక్రాంతి కానుకగా మాస్ మహారాజ్ రవితేజ నటించిన 'క్రాక్' మంచి వసూళ్లతో నడుస్తోంది. మరో రెండు రోజుల్లో రామ్ పోతినేని 'రెడ్'.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'అల్లుడు అదుర్స్' సినిమాలు థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. ఇక జనవరి థర్డ్ వీక్ నుంచి ప్రతి శుక్రవారం కొన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయి. టాలీవుడ్ 50 శాతం ఆక్యుపెన్సీతో డేర్ గా సినిమాలు రిలీజ్ చేస్తుంటే బాలీవుడ్ తో పాటు మిగతా ఇండస్ట్రీలలో సినిమాల విడుదల విషయంలో ఆలోచిస్తున్నారు. తెలుగు తమిళ్ డబ్బింగ్ సినిమాలు మాత్రమే ప్రదర్శిస్తూ వస్తున్నారు.
అయితే టాలీవుడ్ లో ఇన్ని సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కి రెడీ అవడానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న మద్దతు కూడా కారణమని చెప్పవచ్చు. ఇక కోలీవుడ్ లో 'మాస్టర్' 'ఈశ్వరన్' సినిమాలతో ఆడియన్స్ ని నుంచి స్పందనని తెలుసుకోబోతున్నారు. ఏదేమైనా కోవిడ్ నేపథ్యంలో ఇండియన్ సినిమా టాలీవుడ్ వైపు చూస్తోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.