Begin typing your search above and press return to search.
ఇక విమానలోనూ..నౌకల్లో ఇంటర్నెట్
By: Tupaki Desk | 2 May 2018 6:25 AM GMTవిమానాల్లో `ఫ్లైట్ మోడ్’ ప్రయాణాలకు ఇక తెరపడనుంది. త్వరలో ఇంటర్నెట్ - మొబైల్ కమ్యూనికేషన్ల సదుపాయం విమాన - నౌకాయాన ప్రయాణికులకూ అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ (డీవోటీ) చేసిన ప్రతిపాదనలకు ఉన్నతస్థాయి టెలికం కమిషన్ మంగళవారం ఆమోదముద్ర వేసింది. మేరకు నౌకల్లోనూ - విమానాల్లో ఈ సదుపాయాన్ని కల్పించనున్నారు. దీంతోపాటు మొబైల్ వినియోగదారుల ఫిర్యాదుల పరిశీలనకు ప్రత్యేకంగా అంబుడ్స్ మన్ పోస్టును ఏర్పాటు చేయడానికి కూడా టెలికం కమిషన్ అంగీకరించింది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సిఫారసుల ప్రకారం విమానం 3,000 మీటర్లు - ఆపైన ఎత్తులో ప్రయాణిస్తున్నప్ప్పుడు మాత్రమే స్మార్ట్ ఫోన్ కు ఇంటర్నెట్ కనెక్టివిటీ లభిస్తుంది. టెర్రెస్ట్రియల్ నెట్‌వర్క్‌లతో పొంతన కుదిరే విధంగా చూసుకోవడానికి ఈ నిబంధన విధించారు. సాధారణంగా, బయల్దేరిన నాలుగైదు నిమిషాల్లోనే విమానం మూడువేల మీటర్ల ఎత్తుకు చేరుతుంది. ‘నూతన సదుపాయాల కోసం టెలికం - విమానయాన సంస్థల మధ్య సర్దుబాట్లు చేయాల్సి ఉంటుంది. అందుకు మరో మూడు - నాలుగు నెలల సమయం పడుతుంది’ అని టెలికం కమిషన్ కార్యదర్శి అరుణాసుందరరాజన్ తెలిపారు.
భారత గగనతలంలో ప్రయాణించే విమానాల్లో మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చునని ఆమె వెల్లడించారు. అయితే ఈ సౌకర్యం కోసం టెలికం కంపెనీలు అదనపు చార్జీలు వసూలు చేసే అవకాశముంది. దేశంలో ఇంటర్నెట్ కాలింగ్‌కు అవకాశం కల్పించాలన్న ట్రాయ్ ప్రతిపాదనకూ టెలికం కమిషన్ పచ్చజెండా ఊపింది. అయితే ఇంటర్నెట్ ద్వారా ఏదైనా నెంబరుకు ఫోన్ చేసుకోవడానికి మాత్రం వీలుపడదు. కేవలం సెల్యులార్ నెట్‌వర్క్‌కు సంబంధించిన యాప్ ల ద్వారా మాత్రమే స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఇంటర్నెట్ కాల్స్ చేసుకోవచ్చు. వైఫై సౌకర్యం ద్వారా కూడా ఈ కాల్స్ కు అవకాశముంది. ప్రభుత్వాధీనంలోని బీఎస్ ఎన్ ఎల్ మొబైల్ కాలింగ్ యాప్ ద్వారా ఇంటర్నెట్ టెలిఫోనీకి అవకాశం కల్పించగా, ప్రైవేటు సెల్యులార్ సంస్థల ఫిర్యాదుతో ట్రాయ్ దీనిని నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది. తాజాగా టెలికం కమిషన్ యాప్ ఆధారిత కాలింగ్ కు అన్ని సంస్థలకు అవకాశమివ్వడం గమనార్హం. ఏటేటా టెలికం సంస్థలపై ఫిర్యాదులు పెరిగిపోతుండడంతో వినియోగదారుల సౌలభ్యం కోసం అంబుడ్స్ మన్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అన్ని కమ్యూనికేషన్ సంస్థలపై కలిపి ఏటా ఒక కోటికి పైగా ఫిర్యాదులు ట్రాయ్ కు అందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే టెలికం రంగంలో సులభవాణిజ్య విధానాన్ని అమలు పరిచేందుకూ టెలికం కమిషన్ అంగీకరించింది. నీతిఆయోగ్ సీఈవోతోపాటు టెలికం - రెవెన్యూ - ఎలక్ట్రానిక్స్ - ఐటీ - డీఐపీపీ విభాగాల కార్యదర్శులు టెలికం కమిషన్ లో సభ్యులుగా ఉన్నారు.