Begin typing your search above and press return to search.

ఫారిన్ ప్రేమలో ఇండియన్ స్టార్స్

By:  Tupaki Desk   |   21 March 2018 9:54 AM GMT
ఫారిన్ ప్రేమలో ఇండియన్ స్టార్స్
X
పొరుగింటి పుల్ల కూర రుచి అనే సామెత వాడాలో లేక ప్రేమకు హద్దులు లేవు అనే కొటేషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు నిజ జీవితంలో పెళ్లి దాకా వెళ్ళిన సినిమా ప్రేమలను చూస్తుంటే. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటారా. టాలీవుడ్ సీనియర్ హీరొయిన్ శ్రేయ ఇటీవలే రష్యన్ టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రూ కొస్చీవ్ ను పెళ్లి చేసుకున్నాక అందరి దృష్టి ఇదే దారిలో వెళ్ళిన వెళ్తున్న హీరో హీరొయిన్ల మీద పడింది. పరదేశీయులను పెళ్లి చేసుకోవడం అనేది కొత్తగా మొదలైంది కాదు. ఇక్కడితో ఆగేది కాదు. దశాబ్దాల వెనక్కు వెళ్తే 1958లోనే శశి కపూర్ ఇంగ్లాండ్ నటీమణి జెన్నిఫర్ కెండాల్ ను పెళ్లి చేసుకోవడం అప్పట్లో కట్టుబాట్ల పరంగా చాలా పరిమితులు ఉన్న ఇండియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక అప్పటి నుంచి ఆ జాబితాను ఎవరో ఒకరు కొనసాగిస్తూనే ఉన్నారు. బాలీవుడ్ సీనియర్ మోస్ట్ బ్యాచిలర్ గా పేరు పొందిన సల్మాన్ ఖాన్ ఓ సినిమా షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు లులియా వంతుర్ అనే అమ్మాయితో ప్రేమాయణం సాగించి వచ్చాడని రాయని బాలీవుడ్ మీడియా లేదు.

మహేష్ బాబు, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో తెలుగులో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన హింది హీరొయిన్ ప్రీతీ జింతా పెళ్లి చేసుకుంది అమెరికన్ సిటిజెన్ జీని గుడెనఫ్ ని.అతనితో అక్కడే సెటిల్ అయిపోయిన ప్రీతీ ఇటీవలే ముంబై వచ్చినప్పుడు గెటుగెదర్ కూడా చేసుకుంది. మంచు విష్ణుతో సూర్యంలో నటించిన సెలెనా జైట్లీ భర్త పీటర్ హాగ్ ది ఆస్ట్రియా దేశం. ప్రభాస్ తో ఎక్ నిరంజన్ లో జంట కట్టిన కంగనా రౌనత్ యుకె డాక్టర్ నికోలస్ లాఫర్టితో కొన్నాళ్ళు లవ్ స్టొరీ నడిపింది కాని ఎక్కువ రోజులు సాగలేదు. శృతి హాసన్ సంగతి సరేసరి. లండన్ లవర్ మైకేల్ కోర్సల్ తో చెన్నైలో ఫంక్షన్లకు సైతం వెళ్తోంది. టక్కరి దొంగలో బిపాసా బాసుతో మహేష్ స్క్రీన్ షేర్ చేసుకున్న లీసా రే భర్త లెబనాన్ కు చెందిన జేసన్ డేహ్నీ. ముసుగువేయోద్దు మనసు మీద అంటూ ఖడ్గంలో కిక్కిచ్చిన కిం శర్మ భర్త అలీ పుంజాని ఉండేది కెన్యాలో

రేపో మాపో పెళ్లి కూతురు కాబోతున్న దేవదాసు సుందరి ఇలియానా ఆస్ట్రేలియా కు చెందిన ఫోటోగ్రాఫర్ అండ్రూ నీబోన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తను ఎప్పుడు కొట్టిపారేయలేదు. సో ప్రేమకు వర్ణం - జాతి - కులం - దేశం అనే భేదాలు లేవని సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా వీళ్ళు ప్రూవ్ చేసారు. ఇది సినిమాలకు మాత్రమే పరిమితం కాదు లెండి. రాజకీయాలతో మొదలుపెడితే రాజీవ్ గాంధీతో మొదలుకొని లిస్టు ఎక్కడికో వెళ్తుంది. ఇప్పటికి సినిమావాళ్ళతో ఆపేద్దాం