Begin typing your search above and press return to search.
ఆర్ఆర్ఆర్ తో పాటు మరికొన్ని 'ఆస్కార్' కలలు
By: Tupaki Desk | 28 Aug 2022 7:42 AM GMTసినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరు కూడా ఆస్కార్ కలలు కంటూ ఉంటారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఏడాది వెయ్యికి పైగా సినిమాలు రూపొందుతున్నా కూడా ఏ ఒక్క సినిమా కూడా ఆస్కార్ గడప తొక్కలేక పోతుంది. దాదాపు ఇరవై ఏళ్లుగా ఏ ఒక్క ఇండియన్ సినిమా కూడా కనీసం ఆస్కార్ నామినేషన్స్ ను కూడా దక్కించుకోలేక పోయింది.
ఇన్ని సంవత్సరాల తర్వాత మన సినిమా అయిన ఆర్ ఆర్ ఆర్ తప్పకుండా ఆస్కార్ కు నామినేట్ అవుతుందని.. అవార్డు వచ్చినా రాకున్నా నామినేట్ అవ్వడం చాల గొప్ప గౌరవం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్ సినీ ప్రముఖులు మరియు మీడియా వర్గాల వారు ఆర్ ఆర్ ఆర్ సినిమా ను ఎంతగా ప్రశంసించారో తెల్సిందే.
నెట్ ఫ్లిక్స్ లో ప్రపంచ వ్యాప్తంగా సందడి చేసిన ఆర్ ఆర్ ఆర్ కి ఇప్పుడు ఆస్కార్ ఒక పెద్ద కల గా మారింది. ఇదే సమయంలో ఇండియన్ సినిమాలు అయిన కశ్మీర్ ఫైల్స్ మరియు ఆలియా భట్ నటించిన గంగూబాయ్ కతియావాడి సినిమాలు కూడా ఆస్కార్ కలలు కంటున్నట్లుగా బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో మరియు ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.
ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాటు ఈ రెండు సినిమాలు కూడా ఆస్కార్ లో నామినేట్ దక్కించుకునే సత్తా ఉన్న సినిమాలు అంటూ బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు. ఆలియా భట్ నటనతో ఆస్కార్ లో నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని.. అలాగే ది కశ్మీర్ ఫైల్స్ ఉత్తమ సినిమా యొక్క జాబితాలో నిలిచే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు భావిస్తున్నారు.
ఇండియన్ సినీ ప్రేమికులు మరియు సెలబ్రెటీలు కోరుకున్నట్లుగా ఈ మూడు సినిమాలు ఆస్కార్ బరిలో కనుక నిలిస్తే నిజంగా అద్భుతం అనడంలో సందేహం లేదు. ఇన్నేళ్ల తర్వాత ఆస్కార్ నామినేషన్స్ ను దక్కించుకుంటే ఆ సినిమాలు చరిత్రలో నిలుస్తాయి. వాటిల్లో ఏ ఒక్కటి ఆస్కార్ ను దక్కించుకున్న అదో ఘన చరిత్ర అవుతుంది. మరి ఆ కల నెరవేరేనా చూడాలి.