Begin typing your search above and press return to search.

పాకిస్తాన్లో మన సినిమాలన్నీ పైరసీయే

By:  Tupaki Desk   |   10 July 2017 4:20 AM GMT
పాకిస్తాన్లో మన సినిమాలన్నీ పైరసీయే
X
సినిమా కథ అంటే అవి మన జీవిత కథలే. అంటే మన ఆలోచనలు - అనుబంధాలు - ఆనందాలు - మన నమ్మకాలు ఇలా వీటి చుట్టూనే తిరుగుతాయి. వాటిని ఆధారంగానే మన డైరెక్టర్లు రైటర్లు కథలు రాస్తూ ఉంటారు. కాకపోతే కొన్ని సార్లు రాజకీయపరంగా కూడా కొన్ని కథలు వస్తూ ఉంటాయి. జనాల నమ్మకాలకు ఏదైనా విరుద్దంగా చేసినా లేకపోతే అది ప్రస్తుత సమాజంపై ఏ విదంగానైనా చెడుగా ప్రభావం ఉంటుందంటే.. వెంటనే మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నా ఒక సంస్థ CBFC ఉంది కదా అది కత్తిరింపు మొదలుపెడుతుంది. ఇక మన దేశంలోనే ఇలా ఉంటే.. పక్కనున్న పాకిస్తాన్ లో ఎలా ఉంటుందో చూస్కోండి.

మన దేశంలోనే ఒక సినిమా రాజకీయ పరిస్థితికి భంగం కలిగేలా ఉంటే.. కొన్ని రాష్ట్రాల్లో ఆ సినిమాను రిలీజ్ చేయరు. రిజర్వేషన్ సిస్టంపై వచ్చిన హింది మూవీ ‘ఆరక్షన్’ అలానే కొన్ని రాష్ట్రాలలో బేన్ చేశారు. అయితే మన దేశంలో తీసిన కొన్ని సినిమాలు బయట దేశాలలో కూడా విడుదల అవుతున్నాయి. షారూక్ ఖాన్ - అమీర్ ఖాన్ సినిమాలకు ఒక వరల్డ్ క్లాస్ హీరోలకు ఉండవలినంత మార్కెటే ఉంది. కానీ ఇక్కడ సూపర్ హిట్ అయిన కొన్ని సినిమాలు పక్కనున్న పాకిస్తాన్ లో మాత్రం విడుదలకు నోచుకోలేదు. వాటికి కారణాలు మనం స్పెషల్ గా చెప్పే పనే లేదు. ఆ సినిమాలలో ఎక్కడో పాకిస్తాన్ దేశం పై కించపరిచే సన్నివేశాలు ఉండి ఉండాలి లేదా అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించే లాగానే ఉండాలి.

సల్మాన్ ఖాన్ హిట్ సినిమా ‘ఏక్ థా టైగర్’ పాకిస్తాన్ లో విడుదలకాలేదు. ఎందుకంటే మన హీరో అందులో ఒక రహస్య గూఢచారి కాబట్టి.. పాకిస్తాన్ అమ్మాయిన ప్రేమిస్తాడు కాబట్టి. అలాగే భాగ్ మిల్కా భాగ్ కూడా పాకిస్తాన్ లో విడుదల కాలేదు ఈ సినిమాలో అప్పటి దేశ విభజన కు కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అక్షయ్ కుమార్ ‘బేబీ’.. ‘జాలీ ఎల్‌ ఎల్‌ బి2’.. షారూక్ ఖాన్ ‘రయీస్’ - 'చెన్నై ఎక్స్ ప్రెస్' ఇతర సినిమాలైన .. ‘తేరే బిన్ లాడెన్’ - ‘రాంజన్నా’ - 'డర్టీ పిక్చర్' లాంటి సినిమాలు కూడా విడుదల కాలేదు. కాని విషయం ఏంటంటే.. ధియేటర్లకు రాని ఈ సినిమాలన్నీ పైరసీ రూపంలో అక్కడ దర్శనమిచ్చేశాయి.

అక్కడి ప్రభుత్వాలకు మన సినిమాలతో బేధాభిప్రాయాలు ఎన్ని ఉన్నా ఆడియన్స్ మాత్రం మన సినిమాలు చూస్తారట. పైరసీ అనే మహమ్మారి ఉందికదా వాటి ద్వారా మన సినిమాలు అక్కడే ఒక పెద్ద వ్యాపారంగా తయారు చేసి నడిపించేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు. పైగా ఇదొక కోట్ల రూపాయల వ్యాపారంగా మారిపోయినట్లు తెలుస్తోంది. దాని బదులు మనోళ్ళే డివిడిలు చేసేసి అమ్మేస్తే పోలా? అప్పుడు వాటిని కూడా బ్యాన్ చేస్తారేమో!!