Begin typing your search above and press return to search.
ఆస్కార్ బరిలో ఇండియన్ షార్ట్ ఫిల్మ్!!
By: Tupaki Desk | 5 Feb 2021 12:42 PM GMTప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ షార్ట్ ఫిల్మ్ గురించి వార్తలు బాగా వినిపిస్తున్నాయి. స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ షార్ట్ ఫిల్మ్ గురించి ఎందుకు అంతలా మాట్లాడుకుంటున్నారు అంటే ఆ షార్ట్ ఫిల్మ్ ఈ ఏడాది ఆస్కార్ కు నామినెట్ అయింది. 'నట్కాట్' పేరుతో రూపొందిన ఈ షార్ట్ ఫిల్మ్ ప్రస్తుతం వార్తలలో ట్రెండ్ అవుతోంది. 2019 జూలైలో నట్కాట్ రూపొందించగా ఇప్పుడు 2021 ఆస్కార్ ఉత్తమ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఎంపికైంది. అన్నూకాంప హార్స్ రచించిన ఈ నట్కాట్ లఘుచిత్రంలో విద్యాబాలన్ తో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ సానికా పటేల్ నటించింది. ఈ విషయాన్నీ తెలుపుతూ విద్యాబాలన్ తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
ఎంతో గర్వంగా ఉందంటూ.. "మేం చేసిన నట్కాట్ షార్ట్ ఫిల్మ్ 2020 ముగిసిన తర్వాత 2021 ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుక ఆస్కార్ బరిలో నిలిచింది" అంటూ పేర్కొంది. ఇదివరకు మాసాన్, జుబాన్ సినిమాలను నిర్మించిన షాన్ వ్యాస్ ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించాడు. ఆయనతో పాటు రోనీ స్క్రూవాలా ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే తన పోస్ట్ లో ఓ చిన్న వీడియో క్లిప్ కూడా షేర్ చేసింది విద్యాబాలన్. అందులో తల్లి క్యారెక్టర్ తన బిడ్డకు.. పితృస్వామ్యం, పురుషాహంకారం, జెండర్ ఈక్వాలిటీ గురించి నిద్రించే ముందు కథలుగా చెబుతుంది. అయితే ఈ ఏడాది 93వ ఆస్కార్ అకాడమీ అవార్డుల వేడుకలు ఏప్రిల్ 25న జరగబోతుంది. నట్కాట్ ఇదివరకు ట్రిబేకా వీఆర్ఒన్ గ్లోబల్ ఫిల్మ్ ఫెస్టివల్ తో పాటు మెల్బోర్న్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, లండన్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడింది. నాట్కాట్ జర్మన్ స్టార్ ఆఫ్ ఇండియా అవార్డును కూడా గెలుచుకుంది. చూడాలి మరి నట్కాట్ ఆస్కార్ బరిలో ఏం చేస్తుందో!.