Begin typing your search above and press return to search.
భారతదేశపు గానకోకిల లతా మంగేష్కర్ ఇక లేరు!
By: Tupaki Desk | 6 Feb 2022 5:12 AM GMTభారతదేశపు గానకోకిల.. లెజెండరీ నేపథ్యగాయని లతా మంగేష్కర్ ఇక లేరు. మధుర గాయని 92 ఏళ్ళ వయసులో మరణించారు. కోవిడ్ తో ఆసుపత్రిలో చేరిన తర్వాత లతా మంగేష్కర్ అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని కబురు అందగా అంతా సంతోషించారు. కానీ ఇంతలోనే మేటి గాయని నింగికేగారనే వార్తను వినాల్సి వచ్చింది.
ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో లతాజీ మరణించారు. కోవిడ్-19 పాజిటివ్ అని తేలిన తర్వాత మంగళవారం మంగేష్కర్ ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కి తరలించారు. లతా మంగేష్కర్ ప్లేబ్యాక్ సింగర్ గా భారతీయ సినీపరిశ్రమకు అపార సేవలందించారు. భారతరత్న- పద్మవిభూషణ్- పద్మభూషణ్ - దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను దక్కించుకున్న మేటి గాయనిగా భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించారు.
హిందీ చిత్రాల కోసం వందలాది పాటలకు ప్లేబ్యాక్ పాడిన లతాజీ భారతీయ సినిమాకి ఒక ఐకాన్ అనడంలో సందేహం లేదు. ఆమె మరాఠీ - బెంగాలీ సహా అనేక ప్రాంతీయ భాషలలో కూడా పాడారు. ప్రముఖ సంగీత కుటుంబానికి చెందిన శ్రీమతి మంగేష్కర్ సంగీతాన్ని అందించడమే కాకుండా కొన్ని చిత్రాలను నిర్మించారు. ఆమె `నైటింగేల్ ఆఫ్ ఇండియా`గా ప్రసిద్ధి చెందారు.
లతా మంగేష్కర్ 1929లో జన్మించారు. ఐదుగురు తోబుట్టువులలో పెద్ద కుమార్తెగా జన్మించిన లతాజీ భారతీయ సినీపరిశ్రమలో గాయనిగా అసమానంగా ఎదిగారు. మంగేష్కర్‌ను ICUకి తీసుకెళ్లిన తర్వాత ఆసుపత్రిలో ప్రముఖ గాయని ఆశా భోంస్లే సందర్శించారు. వారి తండ్రి శాస్త్రీయ సంగీత విద్వాంసుడు పండిట్ దీనానాథ్ మంగేష్కర్ .. లతా మంగేష్కర్ కి మొదటి సంగీత పాఠాన్ని అందించారు. 1942లో, ఆమె తండ్రి మరణించినప్పుడు 13 ఏళ్ల లతా మంగేష్కర్ మరాఠీ చిత్రపరిశ్రమలో తన వృత్తిని ప్రారంభించారు. 1945లో మధుబాల నటించిన మహల్ చిత్రంలోని `ఆయేగా ఆనేవాలా..` పాటను ఆలపించగా.. శ్రీమతి మంగేష్కర్ కు తొలి హిట్ దక్కింది. అక్కడి నుండి లతా మంగేష్కర్ కెరీర్ చాలా ఎత్తుకు ఎదిగింది. ఆమె బైజు బావ్రా- మదర్ ఇండియా- మొఘల్-ఎ-ఆజం,.. బర్సాత్ - శ్రీ 420 వంటి చిత్రాలకు పాడారు. కెరీర్ లో ఎన్నో గొప్ప హిట్ పాటల్ని పాడారు. ఆమె నౌషాద్ రాసిన రాగ-ఆధారిత కంపోజిషన్ లను పాడారు. మధుమతిలో సలీల్ చౌదరి లిల్టింగ్ ట్రాక్ లు ఆమెకు ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందించాయి. బీస్ సాల్ బాద్- ఖండన్ - జీనే కీ రాహ్ చిత్రాలతో మరో మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి. పరిచయ్- కోరా కాగజ్ -లేకిన్ చిత్రాలకు ఉత్తమ నేపథ్య గాయనిగా మూడు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు.