Begin typing your search above and press return to search.
ఈ సంఘం సరైన భర్తల్ని ఇవ్వలేదా?
By: Tupaki Desk | 27 Feb 2019 5:29 AM GMTమంచోడు.. మనసున్నోడు.. ఆదర్శ మొగుడు.. ఈ సమాజంలో ఉన్నాడా? ఉంటే చూపించండి! అంటూ ప్రశ్నిస్తున్నారు సీనియర్ నటి జయప్రద. రాజ్యశ్రీ రాదోడ్ (జయ) అనే అత్త గా సంఘాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించేది ఒక టీవీ షోలోనే అయినా అది ఎందరో బూర్జువా మొగుళ్ల గుండెల్ని తాకుతోంది. అమ్మ నిదుర లేవగానే మంచి భార్యగా ఉండు అని కూతురికి చెబుతుంది కానీ - మంచి మొగుడుగా ఉండు అని కొడుక్కి చెప్పదు! సమాజం కూడా అంతే. ఈ సమాజం అలాంటిది! అంటూ తూట్లు పొడిచే కామెంట్లతో విరుచుకుపడడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది.
`పెర్ఫెక్ట్ పతి` పేరుతో భర్తల్ని ప్రశ్నించే టీవీ షోతో అత్త పాత్ర పోషిస్తున్న జయప్రద మరోసారి చర్చల్లోకి వచ్చారు. అప్పట్లో ఈటీవీ `జయప్రదం` కార్యక్రమం కంటే ఎంతో పవర్ ఫుల్ కార్యక్రమంలో జయప్రద కనిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కోడలు విధిత పాత్రలో నటి సనా అమిన్ షేక్ కనిపిస్తున్నారు. ఇక కోడలి కోసం దుర్మార్గుడైన కొడుకునే సంహరించే తల్లిగా జయప్రద కనిపిస్తున్నారు. ఆ ముగ్గురితో కార్యక్రమం రక్తి కడుతోంది.
`పెర్ఫెక్ట్ పతి` కార్యక్రమంతో తిరిగి టెలివిజన్ తెరపై కనిపించడంపై జయప్రద ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అత్త పాత్రలో బోలెడన్ని విషయాల్ని వెలుగులోకి తెచ్చే అవకాశం కలిగిందని జయప్రద తెలిపారు. పిల్లలు తప్పు చేయకూడదు అని చెప్పే తల్లులు మంచి భర్తల గురించి మాట్లాడాలనేది ఈ కార్యక్రమం థీమ్. శతాబ్ధాలుగా మంచి భార్యగా ఉండు అనే నినాదం తయారైంది కానీ - మంచి మొగుడుగా ఉండు అనే నినాదం లేనేలేదు! అంటూ కార్యక్రమంలో బోలెడంత వేడి పెంచేయడం హాట్ టాపిక్. మొత్తానికి ఈ కార్యక్రమంతో ఈ సంఘం సరైన భర్తల్ని ఇవ్వలేదా? అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. ఇక భర్తల్ని ప్రశ్నించేందుకు భార్యలంతా ప్రిపేరవుతున్నారన్నమాట!!