Begin typing your search above and press return to search.
ఇండియన్ సూపర్ మాన్ 'శక్తిమాన్' మళ్లీ వస్తున్నాడు
By: Tupaki Desk | 9 July 2022 6:13 AM GMT1980 కిడ్స్ కు శక్తిమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో డిడి నేషనల్ ఛానల్ లో హిందీ లాంగ్వేజ్ లో టెలికాస్ట్ అయిన శక్తిమాన్ సీరియల్ కు అప్పట్లో అద్భుతమైన రెస్పాన్స్ ఉండేది. దేశ వ్యాప్తంగా ఆ సీరియల్ కు ఆధరన ఉండేది. సౌత్ లో భాష రాకున్నా కూడా చాలా మంది పిల్లలు శక్తిమాన్ సీరియల్ ను చూసేందుకు ఆసక్తి చూపించేవారు.
పిల్లలకు అప్పట్లో శక్తిమాన్ అంటే ఒక బ్రాండ్.. స్కూల్ బ్యాగ్స్ మొదలుకుని ప్రతి ఒక్క పిల్లల వస్తువులపై కూడా శక్తిమాన్ ఫోటోలు ఉండేవి. అంతగా పాపులర్ అయిన శక్తిమాన్ ను మళ్లీ తీసుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.
డిడి నేషనల్ లో 500 లకు పైగా ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయిన శక్తిమాన్ ను సినిమా రూపంలో తీసుకు వచ్చేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ రెడీ అయ్యింది.
సదరు నిర్మాణ సంస్థ నుండి శక్తిమాన్ యొక్క రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేయడం జరిగింది. శక్తిమాన్ సీరియల్ ను ఒక్క సినిమా గా తీస్తారా.. వెబ్ సిరీస్ గా తీస్తారా లేదంటే సినిమానే పలు భాగాలుగా చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో ఇంకా స్పష్టత రాకుండానే శక్తిమాన్ గా బాలీవుడ్ యంగ్ హీరో రణ్వీర్ సింగ్ నటించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
శక్తిమాన్ ఒరిజినల్ పాత్రను ముఖేష్ ఖన్నా పోషించాడు. ఈ సీరియల్ కు దినకర్ జానీ దర్శకత్వం వహించాడు. ఈ సీరియల్ ను శక్తిమాన్ పాత్ర పోషించడంతో పాటు ముఖేష్ ఖన్నా స్వయంగా నిర్మించారు. సీరియల్ కు సంబంధించిన రైట్స్ ను సోనీ పిక్చర్స్ వారు భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
రెండు దశాబ్దాల క్రితం డిడి నేషనల్ లో చూసిన శక్తిమాన్ ను ఇప్పుడు వెండి తెరపై చూడబోతున్నామనే ఫీల్ చాలా విభిన్నంగా ఉందని అప్పట్లో సీరియల్ ను చూసిన వారు అంటున్నారు. ఇండియన్ సూపర్ మాన్ గా గుర్తింపు దక్కించుకున్న శక్తిమాన్ మరో సారి సినిమా గా ఇండియన్ సినీ ప్రేమికులను ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుందేమో చూడాలి.