Begin typing your search above and press return to search.
మన హీరోలు.. ఇంత ట్విగోయిస్టులా?
By: Tupaki Desk | 4 Aug 2016 7:43 AM GMTట్విట్టర్ లో మా హీరోకు ఇంతమంది ఫాలోవర్లు ఉన్నారు తెలుసా అంటూ ఆ నెంబర్లను అభిమానులు చాలా గర్వంగా చెప్పుకుంటారు. బాగానే ఉంది. అయితే మా హీరో ఇంతమందిని ఫాలో అవుతాడు తెలుసా అంటూ కూడా గర్వంగా చెప్పగలరా. ముఖ్యంగా మన తెలుగు హీరోలు ఎవరెవర్ని ఫాలో అవుతున్నారు అనే విషయం చూస్తే.. కాస్త విస్మయానికి గురి కావల్సిందే.
రెండు కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న లెజండరీ అమితాబ్ బచ్చన్ ఏకంగా వెయ్యి మందిని ఫాలో అవుతుంటే.. ఇండియాలో అత్యంత సంపన్నుడైన యాక్టర్ షారూఖ్ ఖాన్ 81 మందిని ఫాలో అవుతున్నాడు. ఇక అజయ్ దేవగన్ 49 మందిని.. సల్మాన్ ఖాన్ 22 మందిని.. అక్షయ్ కుమార్ 18 మందిని.. అమీర్ ఖాన్ 7 మెంబర్స్ ని ఫాలో అవుతున్నాడు. ఒక ప్రక్కన అమితాబ్ సాబ్ అంతమందిని ఫాలో అవుతుంటే.. ఈ మిగిలిన హీరోలకు ఏల అంత ఈగో.. అమీర్ మరీ దారుణంగా ఏడుగురునే ఫాలో అవుతున్నాడు అనుకుంటున్నారేమో.. మన తెలుగు హీరోలు అంతకంటే దారుణాతి దారుణం.
టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన పవన్ కళ్యాణ్ ఎవ్వరినీ ఫాలో అవ్వట్లేదు. మరో టాప్ స్టార్ మహేష్ బాబు తన బావ జయదేవ్ గళ్ళాను.. అల్లు అర్జున్ కేవలం నరేంద్ర మోడీని.. జూనియర్ ఎన్టీఆర్ కేవలం రాజమౌళిని.. ఫాలో అవుతున్నారు. తమిళంలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. రజనీకాంత్.. ట్విట్టర్లో నరేంద్ర మోడీతో పాటు తన కూతుళ్లను అల్లుడు ధనుష్ ను అలాగే ఏ.ఆర్.రెహ్మాన్ ను ఫాలో అవుతున్నారు. ఆయన అల్లుడు ధనుష్ 120 మందిని ఫాలో అవుతుండగా.. సూర్య 26 మందిని ఫాలో అవుతున్నాడు. హీరో విజయ్ మాత్రం '0' అంతే. వీళ్ళందరినీ ట్విట్టర్లో ఈగోయిస్టులు.. అదే ముద్దుగా ''ట్విగోయిస్టులు'' అనాల్సిందే మరి. కాదంటారా?
మన హీరోయిన్లు బెటర్ లే. ఎందుకంటే వాళ్లు చాలామందిని ఫాలో అవుతున్నారు. శృతి హాసన్ (300) - సమంత (150) - తమన్నా(150) - రకుల్ ప్రీత్ (147) - రెజీనా (117) చాలామందినే ఫాలో అవుతుండగా.. కాజల్ ఒక్కత్తే డబుల్ డిజిట్లో 45 మందిని ఫాలో అవుతుంది. ఆమెను కూడా కాస్త ట్విగోయిస్టు అనొచ్చా? పర్లేదులేండి. .