Begin typing your search above and press return to search.
శంకర్ 'ఇండియన్ 2' వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నారా..?
By: Tupaki Desk | 2 April 2021 5:55 AM GMTదక్షిణాది అగ్ర దర్శకుడు శంకర్ పై ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు మద్రాసు హైకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ''ఇండియన్ 2'' సినిమా పూర్తి చేయకుండా కొత్త సినిమా ఒప్పుకోవడం సరైనది కాదని.. ఈ సినిమాకు రూ.236 కోట్లు ఖర్చు చేశామని.. శంకర్ కు పారితోషకంగా మాట్లాడుకున్న రూ.40 కోట్లలో రూ.14 కోట్లు చెల్లించామని నిర్మాణ సంస్థ తెలిపింది. తమ సినిమా కంప్లీట్ చేసే వరకు దర్శకుడు శంకర్ మరో సినిమా చేయకుండా స్టే ఇవ్వాలని హైకోర్టును కోరింది. దీనిపై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు డైరెక్టర్ శంకర్ కు మరో సినిమాకు దర్శకత్వం వహించకుండా తాము స్టే ఇవ్వలేమని తీర్పు చెప్పింది. దీనిపై ఇంతవరకు శంకర్ స్పందించలేదు.
అయితే కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం శంకర్ ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారట. లైకా వారికి 'ఇండియన్ 2' సినిమా పెండింగ్ పోర్షన్ ని పూర్తి చేసి అనుకుంటున్నారట. ఇంకా 50 రోజుల షూట్ మిగిలి ఉండగా.. రెండు షెడ్యూల్స్ లో చిత్రీకరణ జరిపేలా ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే కమల్ హాసన్ ని కలిసి ఈ విషయం గురించి మాట్లాడి ఆయన పొలిటికల్ క్యాంపెన్ పూర్తైన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసేలా ఒప్పించాలని చూస్తున్నారట. ఇక చరణ్ స్క్రిప్ట్ కోసం మరో టీమ్ తో వర్క్ చేస్తున్నారట. శంకర్ ముందుగా 'ఇండియన్ 2' సినిమా పూర్తి చేయాలని అనుకుంటే మాత్రం 'RC15' ప్రాజెక్ట్ కాస్త లేట్ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.