Begin typing your search above and press return to search.

ఆమె ఇందిరా గాంధీనా?

By:  Tupaki Desk   |   6 March 2018 4:57 PM GMT
ఆమె ఇందిరా గాంధీనా?
X
బాలీవుడ్ లో గత కొంతకాలంగా డిఫెరెంట్ సినిమాలు చాలానే తెరకెక్కుతున్నాయి. ఎక్కువగా నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా దర్శకులు కథలను అద్భుతంగా చూపిస్తున్నారు. బయోపిక్ వంటి కథలకు కూడా ఆదరణ దక్కుతోంది. ఇకపోతే ఎవరు చేయని విధంగా అజయ్ దేవగన్ 1980ల్లో ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని జరిగిన నిజమైన కథను తెరపై చూపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అమయ్‌ పట్నాయక్‌ అనే నిజాయతీ గల ట్యాక్స్‌ అధికారిగా అజయ్‌ నటిస్తున్నారు.

అప్పట్లో జరిగిన అతిపెద్ద రెయిడింగ్‌ నేపథ్యంలో సినిమా కథను నిర్మిస్తున్నారు. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ముందే రెయిడ్ అనే టైటిల్ ను కూడా సెట్ చేశారు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే .. ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. కావాలని పెట్టారా లేక కథలో ఆ పాత్ర నిజమేనా అనే కామెంట్స్ వస్తున్నాయి. అప్పట్లో ఇందిరా గాంధీ ప్రధాని గా దేశాన్ని ఎలుతున్నారు.

అయితే ఈ సినిమాలో ఆమె మూలాల నిజంగా ఉన్నాయా అని చిత్ర యూనిట్ అనుమానాన్ని రేపుతోంది. ఎందుకంటే రీసెంట్ గా రిలీజ్ చేసిన 'బ్లాక్‌ జమా హై’ అనే పాటను రిలీజ్ చేశారు. పాటలో నల్ల ధనాన్ని వెతుకుతున్నట్లు చూపించారు. పాట చివరలో ఆఫీసర్‌ పట్నాయక్‌ పై ఓ కన్నేసి ఉంచండి. నాకు రిపోర్ట్‌ ఇస్తూనే ఉండండి’ అని ఇందిరా గాంధీ చెబుతున్నట్లు ఆవిష్కరించారు. ఇందిరా గాంధీ పాత్రను పూర్తిగా చూపించలేదు గాని.. పాత్రను చూస్తే.. ఆమె భావాలతో ఉన్నట్లుగా అనిపిస్తుంది. మరి సినిమాలో ఆ పాత్ర ఏ తరహాలో ఉంటుందో చూడాలి.