Begin typing your search above and press return to search.

కాపీ కొట్టలేదు.. ఐడియా తీసుకున్నా..

By:  Tupaki Desk   |   8 Jun 2017 4:42 PM GMT
కాపీ కొట్టలేదు.. ఐడియా తీసుకున్నా..
X
ఈ శుక్రవారం ఆడియన్స్ మరో కామెడీ సినిమాను చూడబోతున్నారు. గత వారం వచ్చిన 'ఫ్యాషన్ డిజైనర్' 'అంధగాడు' వంటి కామెడీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయ్ కాబట్టి.. ఇప్పుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ''ఆమీ తూమీ'' ఎలా ఉండోబోతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ సందర్భంగా దర్శకుడు ఇంద్రగంటి ఏమంటున్నాడంటే.. తన ప్రతీ సినిమాకూ ఐడియా ఎక్కడో ఒకచోట నుండి వచ్చింది కాని.. పూర్తి స్థాయిలో కంటెంట్ కాపీ మాత్రం కొట్టలేదు అంటున్నాడు.

''అష్టాచమ్మా సినిమాను తీసినప్పుడు.. ది ఇంపార్టెన్స్ ఆఫ్‌ బీయింగ్ ఎర్నెస్ట్ నవల ఆధారంగా రూపొందించాను. గోల్కొండ హైస్కూల్ సినిమా ఒక నవల. అంతకుముందు ఆ తర్వాత సినిమా మొత్తం నేను రాసుకున్నదే. బందిపోటు సినిమాను ది బిగ్ హ్యాండ్ అనే చిన్నసైజు నవల ఆధారంగా రాశాను. జెంటిల్మన్ కథను నాథన్ అనే అతను అందించాడు. రిచార్డ్ షెరిడాన్ రాసిన ఇంగ్లీష్ డ్రామా ఆధారంగా ఆమీ తూమీ క్రియేట్ చేశాను. పూర్తిస్థాయిలో ఏ నవలనూ కాపీ చేయలేదు. ఐడియాను తీసుకుని సొంతంగా డెవలప్ చేశాను'' అని చెప్పాడు ఇంద్రగంటి మోహనకృష్ణ.

ఈయన తీసిన ఆమీ తుమీ సినిమా ట్రైలర్ యావరేజ్ గా ఉన్నా కూడా.. ధియేటర్లో కామెడీ మాత్రం అదిరిపోతుందని అంటున్నాడు. ఏదేమైనా కూడా బాహుబలి 2 ఇచ్చిన పీక్స్ ఎంటర్టయిన్మెంట్ తరువాత రారండోయ్ వేడుక చూద్దాం సినిమా తప్పించి ఇతరులు ఎవ్వరూ పెద్దగా క్యాష్‌ చేసుకోలేకపోయారు. మరి ఆమీ తూమీ ఏం చేస్తుందో చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/