Begin typing your search above and press return to search.
ఇంద్రగంటి.. ఆమె గురించి వివరణ ఇచ్చాడు
By: Tupaki Desk | 9 Jun 2017 12:49 PM GMTఒక హీరో హీరోయిన్ కలిసి మళ్లీ మళ్లీ నటించినా.. ఒక దర్శకుడి సినిమాల్లో తరచుగా ఒకే హీరోయిన్ కనిపించినా జనాలకు లేనిపోని డౌట్లు వచ్చేస్తాయి. వాళ్ల నేపథ్యం ఏంటో కూడా చూడకుండా రకరకాల ఊహాగానాలు పుట్టించేస్తారు. సందేహాలు వ్యక్తం చేస్తారు. ఇంద్రగంటి మోహనకృష్ణ తన సినిమాల్లో ఈషాకు మళ్లీ మళ్లీ కథానాయికగా అవకాశం ఇస్తుండటంతో జనాలకు ఇలాంటి లేని పోని డౌట్లు వచ్చేశాయి. ఆమె మీద ఆయనకు అంత ఇంట్రెస్ట్ ఏంటో అని చర్చలు పెట్టేశారు. ఐతే ఈ విషయమై ఇంద్రగంటి ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. తన పాత్రలకు సరిపోతోంది కాబట్టే ఆమెకు ఛాన్సులిస్తున్నట్లు చెప్పాడు.
ఈషా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కనెక్టయ్యే అమ్మాయని.. ఆమె ఆంధ్రా యాసతో పాటు తెలంగాణ యాస కూడా చాలా బాగా మాట్లాడుతుందని చెప్పాడు ఇంద్రగంటి. ‘అమీతుమీ’ విషయానికి వస్తే.. అందులో కథానాయిక పక్కా తెలంగాణ యాస మాట్లాడాల్సి ఉంటుందని.. ఈషా ఏ ఇబ్బందీ లేకుండా తెలంగాణ యాసలో మాట్లాడగలదు కాబట్టే ఆమెకు ఛాన్స్ ఇచ్చానని చెప్పాడు ఇంద్రగంటి. ఈషా మంచి నటి అని.. పైగా తన సినిమాల్లో తెలుగుదనం ఉంటుందని.. తెలుగు నటీనటులకే ప్రాధాన్యం ఇస్తానని.. అందుకే ఆమెకు మళ్లీ మళ్లీ అవకాశాలిస్తున్నానని చెప్పాడు. పర భాషా నటిని ఎంచుకుంటే వాళ్లకు తెలుగులో ట్రైనింగ్ ఇచ్చి.. వేరేవాళ్లతో డబ్బింగ్ చెప్పించి.. ఎంతో ఇబ్బంది పడాల్సి ఉంటుందని.. పైగా సహజత్వం కూడా లోపిస్తుందని.. తెలుగుదనం ఉన్న పాత్రలకు తెలుగమ్మాయిల్నే తీసుకుంటానని ఇంద్రగంటి వివరించాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/