Begin typing your search above and press return to search.

అమీ తుమీ దర్శకుడికి హీరో దొరికేశాడు

By:  Tupaki Desk   |   2 Sept 2017 2:00 PM IST
అమీ తుమీ దర్శకుడికి హీరో దొరికేశాడు
X
టాలీవుడ్ లో చాలామంది దర్శకులు ఎవరికీ వారు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారనే చెప్పాలి. ఎన్ని యాక్షన్-లవ్ -ఫ్యామిలీ లాంటి తరహాలో ఎన్ని కథలోను వస్తున్న ప్రతి దర్శకుడు ఎక్కడో ఒక చోట తన మార్క్ ని చూపెడతాడు. అలాంటి తరహాలోనే సినిమాలను తెరకెక్కిస్తున్న దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి.

ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్తదనాన్ని చూపిస్తూ.. మంచి పేరును తెచ్చుకుంటున్నాడు ఈ దర్శకుడు. మెయిన్ గా యువ హీరోలతో ఆయన చేస్తున్న ప్రయోగాలు చాలా ఆకట్టుకుంటున్నాయి. స్టార్స్ లేకుండా చిన్న తారలతోనే వినోదాన్ని రప్పిస్తూ ప్రేక్షకుల మన్ననలను అందుకుంటున్నాడు. చివరగా ఈ దర్శకుడు "అమీ తుమీ" అనే సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయ్యింది. కేవలం వెన్నెల కిషోర్ తో సినిమా అంతా నడిపించేశారు. అయితే ఇప్పుడు గత చిత్రాలకు బిన్నంగా ఒక కొత్త తరహా చిత్రంతో రాబోతున్నాడట. ఈ సినిమా హీరో ఎవరో తెలుసా?

కెరీర్ ను ఇప్పుడిపుడే సెట్ చేసుకుంటున్న సుదీర్ బాబు హీరోగా ఓ కార్పొరేట్ కంపెనీ నిర్మాణంలో ఇంద్రగంటి తన కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సుదీర్ బాబు కూడా స్టోరీని వినగానే ఒకే చేశాడట. సుదీర్ కూడా చాలా రోజులుగా ఒక బ్లక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. మరి మోహనకృష్ణ తెరకెక్కించే సినిమా ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే వారు అధికారికంగా తెలిపేవరకు వెయిట్ చేయాల్సిందే.