Begin typing your search above and press return to search.
ఇంద్రగంటి ఎలా కవర్ చేస్తున్నాడో చూడండి
By: Tupaki Desk | 22 Jun 2016 3:30 PM GMTసినిమా ఇండస్ట్రీ అన్నది సున్నితమైన ఇండస్ట్రీ. ఇక్కడ ఒడుపుగా వ్యవహారాలు నడిపితేనే మనుగడ సాధ్యం. ఉన్నదున్నట్లు మాట్లాడేస్తే చాలా కష్టం. అబద్ధాలు చెప్పకపోయినా.. నిజాలు మాత్రం దాచేయాలి. ఇంద్రగంటి కూడా అదే చేస్తున్నాడు. తన కొత్త సినిమా ‘జెంటిల్ మన్’ కథతో ఇంద్రగంటి ముందు నానినే సంప్రదించినా.. అతను ఖాళీగా లేకపోవడంతో వేరే హీరోల దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. అందులో శర్వానంద్ కూడా ఒకడు. అతను ఈ సినిమా చేయలేనని చెప్పాడు. మరికొందరు హీరోలకు కూడా ఈ కథ చెప్పినా వాళ్లూ తిరస్కరించారు. ఐతే ఈ విషయాన్ని ఇంద్రగంటి అవతలి వాళ్లు నొచ్చుకోకుండా ఎలా చెప్పాడో చూడండి.
‘‘ఈ సినిమా నానితోనే చేద్దామనుకున్నా. కానీ అతను ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో బిజీగా ఉన్నాడు. తర్వాత వేరే సినిమాలు చేయాల్సి ఉంది. డిసెంబరు తర్వాత చేద్దాం సార్ అన్నాడు. స్క్రిప్టు మీద పని చేస్తూనే వేరే హీరోను ట్రై చేద్దాం అనుకున్నాను. శర్వానంద్ కు కథను చెప్పాను. అతను ఎక్స్ ప్రెస్ రాజా సినిమాతో బిజీగా ఉన్నాడు. చాలా మంది హీరోలకు ఈ కథను చెప్పాను. ఐతే నానీనే ఈ సినిమాకు న్యాయం చేయగలడనిపించింది. తన కోసం వెయిట్ చేశాను’’ అన్నాడు ఇంద్రగంటి. శర్వా ఈ కథను తిరస్కరించినప్పటికీ.. ‘ఎక్స్ ప్రెస్ రాజా’తో బిజీగా ఉన్నాడని కవర్ చేశాడు ఇంద్రగంటి. నిజంగా అతడికి కథ నచ్చి ఉంటే.. నాని కోసం వెయిట్ చేసేది అతడి కోసం చేయలేడా? ఇక ఈ కథను తిరస్కరించిన మిగతా హీరోల పేర్లే బయటపెట్టకుండా తెలివిగానే వ్యవహరించాడు ఇంద్రగంటి. ఇలా లేకపోతే ఇక్కడ కష్టమండీ బాబూ.