Begin typing your search above and press return to search.
హిట్లు వచ్చాయ్ కాబట్టి ఇక లవ్వే
By: Tupaki Desk | 6 Aug 2017 4:46 AM GMTఎవరన్నా దర్శకుడికి ఒక సినిమా హిట్టయ్యిందంటే.. ఖచ్చితంగా అదే జానర్లో చాలా సినిమాలు చేయమని ఆఫర్లు వస్తాయి. రాజమౌళి యాక్షన్ సినిమాలే చేస్తున్నట్లు.. లారెన్స్ హారర్ సినిమాలే తీస్తున్నట్లు.. కృష్ణవంశీ అరుపులు పెడబొబ్బులుత సీన్లు చూట్టేసినట్లు.. అవే అవే సినిమాలు తీస్తుంటారు. కాని కొంతమంది దర్శకులు మాత్రం మద్యలో ఫ్లాపులు వస్తే రూటు మార్చి వేరే జానర్లో సినిమాలు తీస్తుంటారు.
అష్టాచమ్మా వంటి రొమాంటిక్ కామెడీ సినిమాను తీసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ.. ఆ తరువాత ట్రాక్ మార్చి చాలా సినిమాలు తీశాడు కాని.. అవి పెద్దగా ఆడలేదు. తరువాత ఒక్కసారిగా జెంటిల్మన్ అనే థ్రిల్లర్ తో సూపర్ హిట్టు కొట్టాడు. తరువాత ఆమీ తుమీ అనే కామెడి సినిమాతో ఇంకా పెద్ద విజయం సాధించాడు. అయితే ఇప్పుడు థ్రిల్లర్ అండ్ కామెడ్ జానర్లు హిట్టుని తెచ్చిపెట్టాయని మనోడు ఆ సినిమాలను చేద్దం అనుకోవట్లేదు. తన తదుపరి సినిమా మరో ప్యూర్ లవ్ స్టోరీ అంటున్నాడు. కామెడీ ఉంటుందో లేదో తెలియదు కాని ఆల్రెడీ లవ్ ట్రాక్ అయితే రాసేశాడట. ఎలాగో రెండు హిట్లు పడ్డాయ్ కాబట్టి ఇప్పుడు లవ్వు మీదనే సినిమా చేయాలని ఫిక్సయినట్లున్నాడు.
ఆమీ తుమీ సినిమాను ఒక చిన్న సినిమాగా తీసి పెద్ద హిట్టే కొట్టడం వలన.. మనోడిపై కాస్త నమ్మకం పెరిగిందిలే. మరి ఈసారి కూడా మనోడు ఒక పెద్ద హిట్టు కొట్టి హ్యాట్రిక్ కొట్టాడంటే మాత్రం.. ఇంద్రగంటి ఒక డిపెండబుల్ డైరక్టర్ అయిపోతాడు.