Begin typing your search above and press return to search.
మహేష్ పేరు చెబితే మత్తు ఎందుకు?
By: Tupaki Desk | 26 July 2015 8:28 AM GMTటాలీవుడ్ లోని ట్యాలెంటెడ్ డైరెక్టర్ల లో ఒకడిగా గుర్తింపు పొందాడు ఇంద్రగంటి మోహనకృష్ణ. అష్టాచమ్మా పేరు తో ఇతను సృష్టించిన అద్భుతం ఇప్పటికీ ఫ్రెష్ నెస్ కోల్పోలేదు. మహేష్.... అంటూ మత్తుగా కలర్స్ స్వాతి పలికిన పలుకులు... అబ్బాయిలకి ఇప్పటికీ గుర్తున్నాయి. మహేష్ బాబు అంటే అమ్మాయిలకి ఎంత ఇష్టమో, అద్దం పడుతుంది అష్టాచమ్మా.
ఈ కాన్సెప్ట్ నే ఎంచుకోవడం వెనుక ఇంద్రగంటికి చాలా పెద్ద స్టోరీయే ఉంది. బెజవాడలోని లయోలా కాలేజ్ లో చదువుతున్న సమయంలో... ఓ ప్రొఫెసర్ 'ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్' అనే అస్కార్ వైల్డ్ పుస్తకాన్ని చదవమని చెప్పారు. అందులో హీరో పేరు జాక్. పల్లెటూరి లైఫ్ బోరు కొట్టి అప్పుడప్పుడూ సిటీలో తిరుగుతుంటాడు. హీరోయిన్ పాత్రధారికి ఎర్నెస్ట్ అనే పేరంటే చాలా ఇష్టం. ఈ స్టోరీ పై మక్కువ పెంచుకున్న ఇంద్రగంటి... దాన్ని మనసులో పెట్టేసుకున్నాడు.
దర్శకుడిగా మారాక గ్రహణం, మాయాబజార్(2006)లు నిరాశపరిచాయి. ఆటైంలో ఓ సినిమా చేద్దామంటూ రామ్‌మోహన్ కోరడంతో... తనకు నచ్చిన పుస్తకాన్ని బైటకు తీశాడు ఇంద్రగంటి. అప్పటికే పోకిరీతో అబ్బాయిలు, అమ్మాయిల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న మహేష్ పేరుతో స్టోరీ రాసుకున్నారు. పేరు ఉపయోగించుకోవడానికి ప్రిన్స్ దగ్గర ముందే పర్మిషన్ కూడా తెచ్చుకున్నారు కూడా.
స్వాతి చేసిన కేరక్టర్ కు మొదట భూమిక ఓకే చెప్పింది. అయితే ఆమె పెళ్లి ఫిక్స్ కావడంతో... సినిమా నుంచి తప్పుకుంది. దీంతో సెకండ్ పెయిర్ గా ఎంచుకున్న వారు లీడ్ కేరక్టర్స్ అయ్యారు. ఎన్నారై కుర్రాడు అవసరాల, సీరియల్స్ చేస్తున్న భార్గవిలను ఓకే చేసుకున్నారు. స్క్రిప్ట్ ప్రకారం అయితే... ఝాన్సీ కేరక్టర్ కి కూడా ఓ లవ్‌స్టోరీ ఉంటుంది. లెంగ్తీ గా ఉంటుందని భావించి, తర్వాత తొలగించారు. అలా కేవలం 1.6 కోట్ల తో తెరకెక్కిన ఈ చిత్రం... సంచనలాలు సృష్టించింది.
ఫ్యామిలీతో సహా చూశామని, సినిమా బాగుందని రాజమౌళి ఫోన్ చేసి చెప్పడాన్ని అతి పెద్ద ప్రశంసగా చెబ్తారు ఇంద్రగంటి. అన్నట్లు ఈ సినిమాపై హైద్రాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ)లో కేస్ స్టడీ కూడా చేశారు. మార్కెటింగ్, కాస్ట్ కంట్రోల్ పై ఈ స్టడీ జరిగింది.