Begin typing your search above and press return to search.

రోజులు గుర్తొచ్చాయిగా

By:  Tupaki Desk   |   16 Jun 2017 2:38 PM GMT
రోజులు గుర్తొచ్చాయిగా
X
సీనియర్ స్టార్లు.. అలనాటి హీరోయిన్లు కలిస్తే ఆ పాత రోజులు గుర్తు చేసుకుని ముచ్చటపడడం సహజమే. అద్భుత క్షణాలను గుర్తు చేసుకుని మరీ ఆనందించడం కూడా బాగానే ఉంటుంది.

అలాంటి ఆనందకరమైన క్షణాలు.. అభిమానుల కళ్లలో కూడా మెరుపులు మెరిపిస్తూ ఉంటాయి. 330కి పైగా సినిమాలలో నటించిన సూపర్ స్టార్ కృష్ణ ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించారు. ఆయన కెరీర్ బెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన మూవీ అమ్మదొంగా. ఆ చిత్రంలో నటించిన ముగ్గురు హీరోయిన్లలో ఒకరు ఇంద్రజ. అమ్మదొంగాలో కృష్ణ-ఇంద్రజల మధ్య సీన్స్ ను సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పటికీ మరిచిపోలేరు. అలాంటి వీరిద్దరూ ఇప్పుడు మరోసారి కలిశారు. తాజాగా నవీన్ విజయకృష్ణ హీరోగా విఠలాచార్య చిత్రం షూటింగ్ ప్రారంభం కాగా.. ఈ ఈవెంట్ కు కృష్ణ.. ఇంద్రజ ఇద్దరూ హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ఓ సందర్భంలో.. కృష్ణతో ఇంద్రజ సెల్ఫీ దిగడం అందరినీ ఆకట్టుకుంది. అలనాటి రోజులను ఒక్కసారిగా గుర్తు చేసేశారు. ఇప్పుడు కృష్ణ ఫ్యామిలీ మెంబర్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన నవీన్ విజయ్ కృష్ణ నటిస్తున్న విఠలాచార్య మూవీలో.. ఇంద్రజ ఓ కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/