Begin typing your search above and press return to search.

సలార్‌ 'కేజీఎఫ్‌' లో అడుగు పెడితే.. అద్బుతమైన మల్టీస్టారర్‌ చర్చలు

By:  Tupaki Desk   |   22 April 2022 1:30 PM GMT
సలార్‌ కేజీఎఫ్‌ లో అడుగు పెడితే.. అద్బుతమైన మల్టీస్టారర్‌ చర్చలు
X
కేజీఎఫ్ 2 సినిమా తో తాజాగా యశ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కేజీఎఫ్ తర్వాత కేజీఎఫ్‌ 2 తో మాత్రమే వచ్చిన యశ్‌ మద్యలో కాని ఇప్పటి వరకు కాని తదుపరి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేదు. ఇక ముందు యశ్ నుండి వచ్చే సినిమాలన్నీ కూడా కేజీఎఫ్‌ రేంజ్ సినిమాలు.. అంతకు మించిన సినిమాలు ఉండాలి.. ఉంటాయి అంటూ అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు.

యశ్‌ హీరోగా మరోసారి ప్రశాంత్‌ నీల్‌ సినిమా ఉంటుందని.. కాని అందుకు సమయం పడుతుందని ఆ మద్య కేజీఎఫ్ 2 సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో చర్చ జరిగింది. ఇప్పుడు వీరిద్దరి కాంబో లో ప్రభాస్ కూడా చేరే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.

కేజీఎఫ్ 3 సినిమాను ప్రశాంత్ నీల్‌ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటికే జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సలార్‌ పాత్రను కూడా కేజీఎఫ్ 3 లో జొప్పిస్తే బాగుంటుంది అనేది కొందరి అభిప్రాయం.

ప్రస్తుతం ప్రభాస్ తో ప్రశాంత్‌ నీల్‌ సలార్‌ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. సలార్‌ సినిమా లోని హీరో పాత్ర ను చాలా క్రియేటివిటీగా ముగింపు పలికి తద్వారా కేజీఎఫ్ 3 లో ఎంట్రీ ఇప్పిస్తే నభూతో అన్నట్లుగా ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు మరియు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఊహాలోకంలో అభిమానులు తెగ ఊగిపోతున్నారు. ఈ ఊహలు ఎంత వరకు వర్కౌట్‌ అవుతాయి అనేది చూడాలి.

ఇప్పటి వరకు ప్రశాంత్‌ నీల్ నుండి సలార్‌ సినిమా తప్ప మరే సినిమా గురించిన క్లారిటీ రాలేదు. కాని ఆయన స్పీడ్‌ గా సినిమాలు చేస్తాడని.. సలార్‌ ను ఈ ఏడాది చివరి వరకు ముగించి వెంటనే వచ్చే ఏడాదిలో మరో తెలుగ స్టార్‌ హీరోతో సినిమాను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది లో ప్రశాంత్‌ నీల్‌ రెండు తెలుగు సినిమాలు విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

కేజీఎఫ్ మరియు సలార్ సినిమా లతో ఆల్‌ ఇండియా స్టార్‌ డైరెక్టర్ గా రాజమౌళి సరసన ప్రశాంత్‌ నీల్‌ నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వంద కోట్ల లోపు బడ్జెట్‌ తో ఈజీగా 600 కోట్ల వసూళ్లను దక్కించుకున్న ప్రశాంత్‌ నీల్‌ ఖచ్చితంగా తోపు దర్శకుడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.