Begin typing your search above and press return to search.
జక్కన్నా ఏంటీ స్వార్థం? ఇండస్ట్రీ గుర్రు!
By: Tupaki Desk | 3 Jan 2022 6:00 AM ISTబంతి తమ కోర్ట్ లో ఉన్నంత సేపూ తన్ని తన్ని వదిలిపెట్టే బాపతు మనుషులుంటారు! ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ తంతు కూడా అలానే ఉందన్న ఆవేదన ఇండస్ట్రీలో వ్యక్తమవుతోంది. ఉరుమెల్లి మెరుపుపై పడినట్టు ఆర్.ఆర్.ఆర్ వెళ్లి ఎక్కడా పడినా కానీ అటూ ఇటూ జరగాల్సి వస్తోంది. పాపం చిన్నా చితకా సినిమాల రిలీజ్ తేదీలు సహా కాస్త పెద్ద సినిమాలు కూడా బెంబేలెత్తిపోతున్నాయ్ ఆర్.ఆర్.ఆర్ వాయిదాల దెబ్బకు.
పాన్ ఇండియా చిత్రం `ఆర్.ఆర్.ఆర్` రిలీజ్ వాయిదాతో చిన్న సినిమాలకు లైన్ క్లియర్ అయినా కానీ ఆ తర్వాత వచ్చేవాళ్లకే టెన్షన్. `భీమ్లా నాయక్`..`ఆచార్య`...`సర్కారు వారి పాట` లాంటి చిత్రాలు ముందుగా సంక్రాంతి కానుకగానే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ `ఆర్ ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ బతిమాలుకుని మరీ ఫిక్స్ అవ్వడంతో మిగతా హీరోలంతా వెనక్కి తగ్గారు. అయితే ఇప్పుడు `ఆర్.ఆర్.ఆర్` వాయిదా పడటంతో మిగతా హీరోలంతా గుర్రుగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. రాజమౌళి తన సినిమా రిలీజ్ కోసం ఎంతో స్వార్ధపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ కామెంట్లు పడుతున్నాయి. ఆయన సినిమాకు ఆయనే ఓ రాజ్యాంగాన్ని రాసేసుకుని ఇష్టాను సారం వ్యవహరిస్తున్నారని పరిశ్రమలో ఆయనపై నెగిటివ్ గా మాట్లాడుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.
మిగతా సినిమా రిలీజ్ ల గురించి పట్టించుకోకుండా ఆయనకు ఆయనే తన సినిమా వాయిదా వేసుకోవడం.. మళ్లీ కొత్త తేదీల్ని ప్రకటించడం మిగతా సినిమాలకు ఎంతో ఇబ్బందికరంగా మారుతోందని అంటున్నారు. అదీ సంక్రాంతి అంటే సినిమా వసూళ్లకు మంచి సీజన్. వారం రోజులు పాటు ఎలాంటి సినిమా అయినా హౌస్ ఫుల్ కలెక్షన్లతో గట్టెక్కిపోతుంది. అలాంటి 7 వ తేదీని `ఆర్.ఆర్.ఆర్` లాక్ చేసి మరీ వదిలేసింది. ఆ రోజు రిలీజ్ అవ్వడం లేదు. కానీ మిగతా సినిమాలు ఆగిపోవాల్సి వచ్చింది. `భీమ్లా నాయక్` చిత్రాన్ని జనవరి 12న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ `ఆర్.ఆర్.ఆర్` నిర్మాతల అభ్యర్ధన మేరకు వాళ్లు దూరం జరిగారు.
దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సీరియస్ గా ఉన్నారు. `ఆర్.ఆర్.ఆర్` మేకర్స్ ని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు. ఈ సీజన్ ఇండస్ట్రీకి ఎంతో కీలకం. ఇప్పుడు ఆ ఛాన్స్ `ఆర్ ఆర్ ఆర్` కారణంగా పరిశ్రమ కోల్పోవాల్సి వచ్చింది. అయితే షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్ కి రెడీగా ఉన్న చిన్న సినిమాలకు ఈ సంక్రాంతి కలిసోచ్చే అంశం. రాధేశ్యామ్ కూడా రిలీజ్ సందేహం ఉంది. అదీ రిలీజ్ లేకపోతే ఈ సంక్రాంతి మీడియం రేంజ్ సినిమాలదే హవాగా మారింది. జనాలు ఎంతో ఆసక్తిగా వేచి చూసినవన్నీ వెనక్కి పోవడంతో అంతా నీరసంగా మారింది సన్నివేశం.