Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్: శాటిలైట్‌ లో ఇండ‌స్ట్రీ బెస్ట్

By:  Tupaki Desk   |   25 Jan 2019 5:15 AM GMT
ట్రెండీ టాక్: శాటిలైట్‌ లో ఇండ‌స్ట్రీ బెస్ట్
X
స్టార్ హీరోల సినిమాల‌కు శాటిలైట్, డిజిట‌ల్ ధ‌ర‌ల్లో రేంజు అంత‌కంత‌కు పెరుగుతోంది. బాలీవుడ్ క‌థానాయ‌కుల‌కు ధీటుగా మ‌న స్టార్ హీరోలు శాటిలైట్, డిజిటల్ ధ‌ర అందుకోవ‌డంలో స‌ఫ‌ల‌మ‌వుతున్నారు. హీరో, ద‌ర్శ‌కుడికి ఉన్న‌ క్రేజుతో ఇది సాధ్య‌మ‌వుతోంది. ఇటీవ‌లే ఇండియా మోస్ట్ అవైటెడ్ RRR శాటిలైట్ - 132 కోట్లు ప‌లికింద‌న్న ప్ర‌చారం హోరెత్తిన సంగ‌తి తెలిసిందే. `బాహుబ‌లి` సిరీస్‌ తో మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్ గా గుర్తింపు పొందిన ఎస్.ఎస్.రాజ‌మౌళి క్రేజు ఈ సినిమాకి అన్నిరకాలుగా క‌లిసొచ్చింది. సినిమా సెట్స్ పై ఉండ‌గానే అన్ని భాష‌ల శాటిలైట్ రికార్ఢ్ ప్రైజ్‌ కి అమ్ముడ‌వ్వ‌డం విశేషం.

బాలీవుడ్, టాలీవుడ్ లో బెస్ట్ శాటిలైట్ అందుకున్న సినిమాల జాబితా ప‌రిశీలిస్తే .. ఇందులో ఎస్.ఎస్.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బాహుబ‌లి 1, 2 చిత్రాలు ఉన్నాయి. బాహుబ‌లి రెండు భాగాలు క‌లిపి శాటిలైట్ ప‌రంగా దాదాపు 90 కోట్ల మేర బిజినెస్ సాగింది. బాహుబ‌లి- 1కి రూ.30కోట్లు, బాహుబ‌లి- 2 చిత్రానికి 60 కోట్ల మేర (సోనికి) బిజినెస్ చేశారు. ఇటీవ‌లే రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ఇండ‌స్ట్రీ సెన్సేష‌న‌ల్ హిట్ `రంగ‌స్థ‌లం` చిత్రానికి శాటిలైట్ .. డిజిటల్ క‌లుపుకుని రూ.30కోట్ల‌కు అమ్మారు. అలాగే మ‌హేష్ `భ‌ర‌త్ అనే నేను` అదేరేంజులో శాటిలైట్, డిజిట‌ల్ బిజినెస్ చేసింది. అల్లు అర్జున్ `స‌రైనోడు` చిత్రానికి 16కోట్ల మేర శాటిలైట్ బిజినెస్ సాగింద‌ని ప్ర‌చార‌మైంది. ఎన్టీఆర్ - అర‌వింద స‌మేత శాటిలైట్ 16కోట్లు ప‌లికింది.

అటు బాలీవుడ్ వైపు వెళితే శాటిలైట్ బిజినెస్ లో స‌ల్మాన్ ఖాన్ రారాజుగా వెలిగిపోతున్నారు. స‌ల్మాన్ న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ చిత్రం రేస్ 3- 150 కోట్ల మేర శాటిలైట్ బిజినెస్ చేసి షాకిచ్చింది. మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ న‌టించిన ఇండ‌స్ట్రీ సెన్సేష‌న‌ల్ హిట్ మూవీ `దంగ‌ల్` - 75కోట్ల మేర శాటిలైట్ రూపంలో అందుకుంది. స‌ల్మాన్ న‌టించిన టైగ‌ర్ జిందా హై -70కోట్లు, సుల్తాన్ -55కోట్ల మేర శాటిలైట్ బిజినెస్ చేశాయి. టాప్ 20లో ప‌లు చిత్రాలు ఉన్నాయి.