Begin typing your search above and press return to search.

త‌మిళ సినీ ప‌రిశ్ర‌మంతా ఏక‌మ‌వుతాంః క‌మ‌ల్‌

By:  Tupaki Desk   |   3 July 2017 3:09 PM GMT
త‌మిళ సినీ ప‌రిశ్ర‌మంతా ఏక‌మ‌వుతాంః క‌మ‌ల్‌
X
కొత్తగా అమలులోకి వచ్చిన జీఎస్టీపై 30 శాతం వినోద పన్ను విధించాలని త‌మిళ‌నాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ సోమ‌వారం నుంచి త‌మిళనాడులోని థియేట‌ర్ల‌ను మూసివేసిన సంగ‌తి తెలిసిందే. అధిక ప‌న్ను విధించ‌డానికి వ్య‌తిరేకంగా త‌మిళ సినీ ప‌రిశ్ర‌మంతా ఒక్క‌తాటిపై నిల‌బ‌డుతుంద‌ని సినీ న‌టుడు కమల్ హాసన్ అన్నారు.

సోమ‌వారం జ‌రిగిన ఓ డబ్బింగ్ స్టూడియో ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా క‌మ‌ల్ మీడియాతో మాట్లాడారు. డబుల్ టాక్సేషన్ కు వ్యతిరేకంగా సోమవారం నుంచి తమిళనాడు అంతటా థియేటర్లను మూసివేశారు. ఇతర దక్షిణాది రాష్ట్రాలలో మాదిరిగానే త‌మిళ‌నాడులో పన్ను విధించాల‌ని తమిళనాడు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అభిరామి రామనాథన్ అన్నారు.

జులై 1 నుంచి అమ‌లులోకి వ‌చ్చిన జీఎస్టీ ప్ర‌కారం కేరళ - ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ - కర్ణాటకలో రూ .100 టికెట్ ఖ‌రీదు రూ.118 రూపాయ‌లువుతుంది. అదే త‌మిళ‌నాడులో రూ.100 టికెట్ ఖ‌రీదు రూ. 148గా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న 30 శాతం అధిక ప‌న్నుకు వ్య‌తిరేకంగా త‌మిళ సినీ ఇండ‌స్ట్రీ నిర‌స‌న‌లు తెలుపుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/