Begin typing your search above and press return to search.
నటుడు వివేక్ ఆకస్మిక మరణంపై ఇండస్ట్రీ షాక్.. ప్రధాని మోదీ విచారం!
By: Tupaki Desk | 17 April 2021 11:30 AM GMTహాస్యనటుడు వివేక్ ఆకస్మిక మరణంతో కోలీవుడ్ విషాదంలోకి వెళ్లింది. అన్ని పరిశ్రమల దిగ్గజాలు ఆయనను సంస్మరించుకుని జ్ఞాపకాల్లోకి వెళుతున్నారు. కోలీవుడ్ బెస్ట్ స్టార్లంతా వివేక్ తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్.. కమల్ హాసన్.. సూర్య.. కార్తీ.. విజయ్.. విక్రమ్.. బోనీకపూర్.. ఇలా ప్రముఖులంతా ఆయనకు నివాళులర్పించారు. శ్రీదేవి అత్యంత ఇష్టపడే నటుడు వివేక్ అని బోనీకపూర్ తాజా ప్రకటనలో వెల్లడించారు. బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబేరాయ్.. స్టార్ డైరెక్టర్ శంకర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ వివేక్ మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. నటనా రంగంలోనే కాక సామాజిక పర్యావరణ వేత్తగా వివేక్ సేవలందించారని మోదీ ట్విట్టర్ లో కొనియాడారు.
ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ తో వివేక్ కి ప్రత్యేక అనుబంధం ఉంది. ``శివాజీ మేకింగ్ సమయంలో నేను అతనితో పంచుకున్న సమయాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను`` అని రజనీ అన్నారు. ``జూనియర్ కలైవనార్.. సామాజిక కార్యకర్త.. నా సన్నిహితుడు వివేక్ మరణం నాకు చాలా బాధ కలిగించింది. శివాజీ మేకింగ్ సమయంలో నేను అతనితో పంచుకున్న సమయాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. అతని ఆత్మకు శాంతి చేకూరాలి`` అని రజనీ ట్వీట్ చేశారు. రజనీకాంత్ కలిసి శివాజీ: ది బాస్- ఉజైపాళి- మనతిల్ ఉరుధి వెండం వంటి చిత్రాల్లో వివేక్ నటించారు. వివేక్ సౌందర్య రజనీకాంత్ వివాహానికి హాజరై తనే దగ్గరుండి రజనీకాంత్ కి స్నేహితులయ్యారని చెబుతారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకున్న రజనీకాంత్ ను అభినందిస్తూ వివేక్ అప్పట్లో ట్వీట్ చేశారు. వివేక్ చివరిసారిగా `ధారాల ప్రభు` అనే చిత్రంలో కనిపించారు. ఇది హిందీ చిత్రం విక్కీ డోనర్ కి తమిళ రీమేక్.
కార్డియాక్ అరెస్ట్ నేపథ్యంలో తమిళ నటుడు వివేక్ శనివారం తెల్లవారుజామున చెన్నై ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 59. గుండెపోటుతో శుక్రవారం ఉదయం ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ విభాగంలో చేరారు. వివేక్ అత్యవసర కొరోనరీ యాంజియోగ్రామ్ ఆంజియోప్లాస్టీ చేయించుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.