Begin typing your search above and press return to search.
సౌండ్ లో సాఫ్ట్ వేర్ మిక్స్ చేసి కొట్టేస్తున్నారు
By: Tupaki Desk | 4 Dec 2015 11:28 AM GMTఇప్పుడంతా టెక్నాలజీ యుగం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతీ పనికీ స్మార్ట్ ఫోన్, ప్రతీ యాక్టివిటీకి ఓ యాప్ పుట్టుకొచ్చేస్తున్నాయి. ఇలాంటి సాంకేతిక కాలంలో.. మ్యూజిక్ లోకి సాఫ్ట్ వేర్ ఎంటర్ అయిపోయింది. ముఖ్యం సాఫ్ట్ వేర్ నుంచి వచ్చిన కొందరు సంగీత దర్శకులు సంచలనాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. దాని ఆధారంగా కొత్త సౌండ్స్ క్రియేట్ చేసి ఆడియన్స్ కు కొత్త అనుభూతిని పరిచయం చేస్తున్నారు.
సన్నీ ఎంఆర్, ప్రవీణ్ లక్కరాజులు ప్రతీ సినిమాకి వినూత్నంగా విభిన్నంగా సౌండ్స్ ఇస్తూ.. దూసుకుపోతున్నారు. నిజానికి సన్నీ ఎంఆర్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారకమునుపు.. ఓ సౌండ్ ఇంజినీర్. ఇది ఆయనకు బాగా కలిసొచ్చింది. తన అనుభవాన్ని ఉపయోగించి, కొత్తగా సౌండ్ మిక్సింగ్ చేసే ప్రయత్నం చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇక ప్రవీణ్ లక్కరాజు అయితే.. అమెరికా రిటర్న్డ్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఈయనకి వర్క్ ఫ్రం హోమ్ కాన్సెప్ట్ లో సినిమాలకు పని చేసిన అనుభవం ఉంది. సాప్ట్ వేర్ టూల్స్ వాడడంలో ప్రవీణ్ కి ఎక్స్ పీరియన్స్ ఎక్కువ.
తాజాగా ఆడియో రిలీజ్ అయ్యిన భలే మంచి రోజు చిత్రానికి సంగీతం ఇచ్చాడు సన్నీ ఎంఆర్. అలాగే కోన వెంకట్ అన్నీ తానై, నితిన్ -నందిత - అంజలి కాంబినేషన్ లో తీసిన శంకరాభరణంకు ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ ఇచ్చాడు. సంగీతం పరంగా చూసుకుంటే.. ఈ రెండు ఆల్బమ్స్ కి చాలా మంచి పేరు వచ్చింది. డిజిటల్ యుగంలో సాఫ్ట్ వేర్ ఆధారిత మ్యూజిక్ తో ఇరగదీసేస్తున్నారు టెక్నాలజీ మ్యుజీషియన్స్.