Begin typing your search above and press return to search.
రియా పేరు మీద పెద్దగా ఆస్తులేమీ లేవు...!
By: Tupaki Desk | 6 Aug 2020 11:30 PM GMTబాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు ప్రస్తుతం రియా చక్రవర్తి చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ తన కుమారుడికి చెందిన సుమారు 15కోట్ల రూపాయలు వేరే అకౌంట్స్ కి బదిలీ అయ్యాయని.. దీనికి రియా చక్రవర్తి మరియు ఆమె కుటుంబ సభ్యులు కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పోలీసులు నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్ ఆధారంగా నిందితులపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో ఈడీ అధికారులు రియా పేరు మీద ఉన్న ఆస్తుల గురించి దర్యాప్తు చేస్తున్నారని సమాచారం.
కాగా ఈడీ అధికారులు రియా చక్రవర్తి పేరు మీద ముంబైలోని ఖర్ ప్రాంతంలో 85 లక్షల రూపాయల విలువైన ప్లాట్ ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్లాట్ కొనడానికి ఆమెకు డబ్బులు ఎలా వచ్చాయనే దాని గురించి అధికారులు ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. దీంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ రికార్డుల ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా రియా చక్రవర్తి నికర ఆస్తి విలువ 10 లక్షల రూపాయల నుంచి 12 లక్షలకు పెరిగిందని.. అది ప్రస్తుతం 14 లక్షల రూపాయలకు పెరిగినట్లు సమాచారం. అంతేకాకుండా రియా ముంబైలో రెండు ప్రాపర్టీలను కొనుగోలు చేసిందని.. అందులో ఒక ప్రాపర్టి రియా పేరుతో ఉండగా మరొకటి ఆమె ఫ్యామిలీ మెంబెర్స్ పేరుతో ఉన్నట్లు తెలుస్తోంది.
దీనిని బట్టి చూస్తే రియాకి పెద్దగా ఆస్తులేమి లేవని అర్థం అవుతోంది. ఇప్పటి వరకు కోట్ల రూపాయలు రియా వెనుకేసుకొచ్చింది అనే వార్తలకు.. బయటపడిన ఆమె ఆస్తుల వివరాలకు సంబంధం లేకుండా ఉంది. ఇక ఈడీ అధికారులు రియాకు మెయిల్ ద్వారా సమన్లు జారీ చేశారు. ఆమెను ఆగస్టు 7న తమ ముందు హాజరు కావాలని కోరినట్లు సమాచారం. కానీ రియా చక్రవర్తి ఆమెపై కేసు నమోదు అయినప్పటి నుంచి అజ్ఞాతంలో ఉంది. మరి ఈడీ ముందు హాజరవడానికి రియా బయటకి వస్తుందేమో చూడాలి.