Begin typing your search above and press return to search.
అంతా వాళ్లే చేస్తున్నట్లేనా?
By: Tupaki Desk | 16 Sep 2017 1:39 PM GMTపైరసీ భూతాన్ని ఎలాగైనా తరిమియాలన్నది ఇండస్ట్రీ జనాల భావన. టాలీవుడ్ లో కంటే కోలీవుడ్ లో ఈ పైరసీ ప్రతాపం మరీ ఎక్కువగా ఉంటుంది. అందుకనే స్టార్ హీరోలు కూడా దీనికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు సూర్యకు చెందిన నిర్మాణ సంస్థ అయిన స్టూడియో గ్రీన్.. ఈ విషయంలో మహా యాక్టివ్ గా ఉంది.
తమ సోషల్ మీడియా పేజ్ లో పైరసీదారుల పేర్లు వివరాలతో ఫోటోలను.. ఇంటర్నేషనల్ అడ్రెస్ లను కూడా పెట్టేస్తోంది స్టూడియో గ్రీన్. ఇండస్ట్రీని ఆదుకునేందుకు ఈ వ్యక్తులను నిరోధించాలన్నది వీరి ఉద్దేశ్యం. పైరసీ ఎవరు చేస్తున్నారో తెలుసుకుని.. వారి ఫోటోలను.. ఇంటర్నేషనల్ అడ్రెస్సులను షేర్ చేయడం అనే కాన్సెప్ట్ బాగానే ఉంది. అయితే ఆ ఫోటోలు వారివేనని ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? అన్నదానికే ఎవరి వద్దా ఆన్సర్ లేదు. పైగా ఏదో ఒక కుర్రాడు సినిమాలను అప్ లోడ్ చేసేస్తే అయిపోతుందా? ఇక్కడ ధియేటర్లలో షూటింగ్ చేస్తోంది ఎవరు?
చాలా పెద్ద రాజకీయ నేతలు ఈ స్కాములో భాగం అని ఎప్పటినుండో వినిపిస్తూనే ఉంది. వారిని వదిలేసి.. ఇలా కుర్రాళ్ళపై పడ్డారేంటి? కనీసం పోలీసు కేసులు అయినా నమోదు.. నిరూపణ అయిన తర్వాత ఇలాంటి చర్యలు చేపట్టి.. వీరిపై ఆరోపణలు ఉన్నాయని చెబితే అంతో ఇంతో అర్ధం ఉంటుంది. అలాంటివేమీ చేయకుండా.. ఆయా వ్యక్తుల అసలు ఫోటోలు అవో కావో కూడా తెలుసుకోకుండా.. నేరుగా నేరస్థులు అంటూ ప్రచారం చేసేయడం.. అంత కరెక్ట్ కాదనే వాదన వినిపిస్తోంది.
అయితే.. పైరసీ దారులపై ఈ మాత్రం దూకుడుగా లేకపోతే నివారించడం చాలా కష్టమని.. అన్నీ నిబంధనల ప్రకారమే అంటే.. పైరసీ దారులు మరింతగా రెచ్చిపోయే ప్రమాదం ఉందని అనే వాదనలో కూడా వాస్తవం ఉంది.