Begin typing your search above and press return to search.
బలం కోసం శిక్షణలో మెగా హీరో మెడకు గాయం
By: Tupaki Desk | 10 July 2021 4:30 AM GMTజిమ్ చేయడం కండలు పొంగించడం అంటే ఆషామాషీనా? బైసెప్.. ట్రై సెప్.. చెస్ట్... షోల్డర్.. యాబ్స్ అంటూ ఒక్కో పార్ట్ కి ఒక్కో ప్రత్యేక శిక్షణ చాలా చాలా అవసరం. నిపుణుడైన జిమ్ కోచ్ సమక్షంలో మాత్రమే ట్రైనింగ్ తీసుకోవాలి. అలాగే జిమ్ చేసేప్పుడు పర్ఫెక్షన్ కుదరకపోయినా ఏదో ఒక కండరం పట్టేస్తుంది. నరాలు మెలితిరిగిపోతాయి. ఫ్యాషన్ కోసం బరువులు ఎత్తడం కుదరదు. అవసరం మేర మాత్రమ బరువులు ఎత్తాలి. ఎక్కడ తేడా కొట్టినా అంతే సంగతి.
అయితే అలాంటి అనుభవమే తనకు కూడా అయినట్టుంది. అందుకే ఇలా మెడకు కట్టు వేయించుకుని కనిపించారు అల్లు శిరీష్. ఈ మెగా హీరో ఇటీవల కండలు పొంగించి యాబ్స్ కోసం షోల్డర్ కోసం కఠోరమైన శిక్షణ తీసుకుంటన్నాడు. అందుకోసం నిపుణులైన కోచ్ లు తనకు జిమ్ లో అందుబాటులో ఉన్నారు. కానీ ఏం తేడా జరిగిందో ఇదిగో ఇలా మెడకు కట్టు తప్పలేదు. తన మెడకు గాయమైందని ఫ్యాషన్ కోసం చేసేది బలం శిక్షణ కానే కాదని కూడా రియలైజ్ అయ్యాడు.
అల్లు శిరిష్ ఇన్ స్టాలో ఈ ఫోటోని షేర్ చేశారు. బలం శిక్షణ సమయంలో తనకు మెడకు గాయమైందని చెప్పడానికి ఏమాత్రం మొహమాటపడలేదు. శిరీష్ పంచుకున్న స్నాప్ లో రికవరీ ప్రక్రియలో అతనికి సహాయపడటానికి మెడకు దన్నుగా ఆ పట్టీని ధరించి కనిపించాడు.
శిరీష్ ప్రస్తుతం `ప్రేమ కాదంట` అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల చిత్రీకరణలోనూ పాల్గొంటున్నారు శిరీష్. ఇందులో అను ఇమ్మాన్యుయేల్ కథానాయిక. ఈ చిత్రానికి రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. లివిన్ రిలేషన్ షిప్ నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది.