Begin typing your search above and press return to search.
రిలీజ్ డేట్ విషయంలో వీరయ్యకు అన్యాయం!
By: Tupaki Desk | 8 Dec 2022 5:14 AM GMTఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాల యొక్క విడుదల తేదీలు అధికారికంగా వెల్లడి అయ్యాయి. బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా ను జనవరి 12వ తారీకున విడుదల చేయబోతున్నారు. ఆ వెంటనే ఒక్క రోజు తేడాతో మెగాస్టార్ చిరంజీవి యొక్క వాల్తేరు వీరయ్య సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
మొత్తంగా నాలుగు సినిమాలు ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తాయని మొదటి నుండి వార్తలు వస్తున్నాయి. అందులో రెండు చిరంజీవి బాలకృష్ణ సినిమాలు కాగా మరో రెండు తమిళ సూపర్ స్టార్స్ విజయ్ మరియు అజిత్ కుమార్ ల యొక్క సినిమాలు. ఈ నాలుగు సినిమాల యొక్క విడుదల తేదీలపై ఫుల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది.
అజిత్ తునివు సినిమా ను జనవరి 11వ తారీకున విడుదల చేయబోతున్నారు. ఇక జనవరి 12వ తారీకున విజయ్ యొక్క వారసుడు మరియు వీర సింహారెడ్డి సినిమా లు విడుదల అవ్వబోతున్నాయి. మూడు సినిమాల తర్వాత సంక్రాంతి బరిలో చివరిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాను విడుదల చేయబోతున్నారు.
మొదటి మూడు సినిమాలు నిరాశ పర్చితే ఆ తర్వాత రోజు రాబోతున్న వాల్తేరు వీరయ్య సినిమాకు కలిసి వస్తుంది. కానీ వీరసింహారెడ్డి సినిమా కనుక మంచి టాక్ ను దక్కించుకుంటే థియేటర్ల విషయంలో వీరయ్య కు అన్యాయం జరగడం ఖాయం అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వీర సింహారెడ్డి సినిమా ను మొదటి రోజు సాధ్యం అయినన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేస్తారు.
కానీ వాల్తేరు వీరయ్య కు మాత్రం ఆ అవకాశం ఉండదు. మూడు సినిమాలు విడుదల అయ్యి ఉండగా భారీ ఎత్తున థియేటర్లు లభించడం అంటే సాధ్యం అయ్యే పని కాదు. కనుక వాల్తేరు వీరయ్య సినిమా ను జనవరి 13న కాకుండా జనవరి 11వ తారీకు విడుదల చేసి ఉంటే బాగుండేది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జనవరి 11న విడుదల చేసి ఉంటే లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో పాటు సంక్రాంతి సెలవులు కూడా కలిసి వచ్చేవి అనేది మెగా ఫ్యాన్స్ యొక్క అభిప్రాయం. కానీ జనవరి 13వ తారీకు విడుదల అవ్వడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదల తేదీ విషయంలో ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడం వల్లే అన్యాయం జరిగిందని మైత్రి మూవీ మేకర్స్ వారిపై మెగా ఫ్యాన్స్ అసహనంతో ఉన్నారు.
సినిమా విడుదల తేదీతో సంబంధం లేకుండా మంచి టాక్ వస్తే తప్పకుండా వాల్తేరు వీరయ్య భారీ వసూళ్ల ను నమోదు చేయడం ఖాయం అంటూ కొందరు మెగా ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమా యొక్క కలెక్షన్స్ రిలీజ్ డేట్ ను బట్టి కాదు చిరు ఇమేజ్ ను బట్టి వస్తాయని ఆయన అభిమానులు కొందరు ధీమాతో ఉన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.